Duvvada Srinivas : మాధురితో దువ్వాడ హల్చల్.. బహిరంగంగానే తిరుగుతున్న జంట..!
Qubetvnews - October 7, 2024 / 06:47 PM IST
Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మళ్లీ తెరమీదకు వచ్చారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న వీరిద్దరూ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అప్పట్లో దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, మధ్యలో దివ్వెల మాధురి.. అప్పట్లో ఈ ఫ్యామిలీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. రోజుకో ట్విస్టు తెరమీదకు రావడంతో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూశారు. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లు విషయంలోనే అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది.
ఇక తన కూతుర్లతో వాణి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు అక్కడకు వెళ్తే.. ఆ ఇంట్లో మాధురి ప్రత్యక్షం కావడం.. దాంతో వాణి పెద్ద ఎత్తున అక్కడే ఆందోళన చేయడం సంచలనం రేపింది. ఇక మాధురి కూడా కొత్త ఇల్లు తనదే అని.. దువ్వాడ తన పేరు మీదనే రాసేశారని చెప్పడం ఇంకో ట్విస్ట్. భార్య వాణి, కూతుర్లు కలిసి దువ్వాడ శ్రీనివాస్ తమను పట్టించుకోవట్లేదని.. మాధురితో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ ఆరోపించారు. శ్రీనివాస్ కూడా తనకు మాధురితో సంబంధం ఉందని బహరింగంగానే ఒప్పేసుకున్నాడు. తన భార్యకు విడాకులిస్తానంటూ చాలా రకాల ఆరోపణలు చేశాడు.
ఆ ఎపిసోడ్ తర్వాత అప్పట్లో తనను రీల్స్ చేయొద్దంటూ శ్రీనివాస్ ఇబ్బంది పెట్టాడంటూ అప్పట్లో మాధురి కూడా వ్యాఖ్యలు చేసింది. ఇలా చాలా రకాల మలుపులు తీసుకున్న తర్వాత తాజాగా మాధురి, శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా వీరిద్దరూ ఓ స్కూటీపై చెక్కర్లు కొట్టారు. ఏ ఇంటి విషయంలో అయితే రచ్చ జరిగిందో అదే ఇంటి వద్ద వీరిప్పుడూ స్కూటీపై ఎంజాయ్ చేస్తున్నారు. వాణితో విడిపోయినప్పటి నుంచి శ్రీనివాస్ పర్మినెంట్ గా మాధురితోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ నిన్న స్కూటీపై చెక్కర్లు కొట్టగా ఈ రోజు తిరుమలలో శ్రీవారిని కూడా దర్శించుకున్నారు.
ఇన్ని రోజులు మీడియా కంట పడకుండా గప్ చుప్ గా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఇలా ఓపెన్ గానే తిరుగుతుండటంతో అంతా అవాక్కైపోతున్నారు. చూసిన నెటిజన్లు కూడా వీరిద్దరూ ఇక ఓపెన్ అయిపోయారు.. సీక్రెట్స్ ఏమీ లేవు అన్నట్టే కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించిన వీరిద్దరూ ఇప్పుడు అంతా మా ఇష్టం అన్నట్టే రెచ్చిపోతున్నారని కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు. మరి వీరిద్దరి వ్యవహారం ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి.





