Pawan Kalyan : పదేండ్లు కూటమిలోనే జనసేన.. పవన్ అసలు ప్లాన్ అదేనా..?
Qubetvnews - November 21, 2024 / 04:41 PM IST
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. సినిమాలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. అయితే రాజకీయాలపై ఆయన పూర్తిగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్ లో రాజకీయాలపై పూర్తి పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొన్ని కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పదేండ్లు సీఎంగా ఉండాలని కోరారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ పదేండ్ల దాకా కూటమిలోనే ఉండాలని కోరుకుంటున్నారా అని చర్చించుకుంటున్నారు.
ఎందుకంటే పవన్ ను ఆయన అభిమానించే వాళ్లు కచ్చితంగా సీఎంగా చూడాలని కోరుకుంటారు. పవన్ ఎప్పుడెప్పుడు సీఎం అవుతాడో అని జనసైనికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది చంద్రబాబు పదేండ్లు సీఎంగా ఉండాలని పవన్ కోరకుంటే.. ఆయన సీఎం కావాలని కోరుకోవట్లేదనేది అర్థం అవుతోంది. కానీ పవన్ ప్లాన్ వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలో తిరుగులేని నేతగా ఎదగాలని భావిస్తున్నారంట. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మోడీ తర్వాత అంత పాపులర్ నేత ఎవరూ లేరు.
ఆయన ముఖాన్ని తప్పిస్తే.. ప్రజలకు బాగా తెలిసిన పబ్లిక్ ఫిగర్ అంటే పవన్ కల్యాణ్ అనే చెప్పుకోవాలి. నేషనల్ మీడియా కూడా పవన్ కామెంట్స్ ను ఇప్పటికే హైలెట్ చేస్తోంది. అందుకే ఆయన కూటమిలో బలమైన నేతగా ఎదిగితే.. అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అవసరం అనుకుంటే కేంద్రంలో కూడా చక్రం తిప్పొచ్చిన భావిస్తున్నారంట. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో కూడా అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. అలా చూసుకుంటే మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.
అప్పుడు సెంట్రల్ లెవల్ లో కీలక పదవి పవన్ కు ఆఫర్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలా పవన్ ఎన్డీయేలో పొలిటికల్ స్టార్ గా ఎదగాలని ప్లాన్ వేసుకుంటున్నారంట. అందుకే రాష్ట్రానికి పరిమితం కావొద్దని భావిస్తున్నట్టు సమాచారం. కాలాన్ని బట్టి వ్యూహాలు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. మరి పవన్ గమనం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి.





