Heroines : ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న భామలు వీరే.. పెళ్లి ఎప్పుడో మరి..?

Qubetvnews - February 17, 2024 / 07:23 AM IST

Heroines : ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న భామలు వీరే.. పెళ్లి ఎప్పుడో మరి..?

Heroines :

ఈ నడుమ సినీ ఇండస్ట్రీలో బాగానే డేటింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి కాస్తా ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్లిపోయాయి. ఏ ట్రెండ్ అయినా ముందుగా సినిమా ఇండస్ట్రీలోనే వస్తుందనుకోండి. ఇప్పుడు ఈ డేటింగ్ వ్యవహారాలు సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లోనే కాస్త ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ముద్దు గుమ్మలు పెళ్లిక ముందే డేటింగ్ లు చేసి తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు డేటింగ్ చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుంటున్నారు. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న భామల గురించి తెలుసుకుందాం.

తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతోంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీకి పరిమితం అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ను ఊపేస్తోంది. నార్త్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. కాగా అక్కడకు వెళ్లిన తర్వాత విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్-2లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం డీప్ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో వేచి చూడాలి.

శృతిహాసన్..

శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఆమె ఇంతకు ముందే చాలా మందితో డేటింగ్ చేసింది. హీరో సిద్దార్థ్, ధనుష్ తో పాటు అప్పట్లో లండన్ కు చెందిన వ్యక్తితో కూడా డేటింగ్ చేసింది. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్టు శాంతాను హజారికతో డేటింగ్ లో ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. పైగా పబ్లిక్ గానే ముద్దులు పెట్టేసుకుంటూ తిరుగుతున్నారు. మరి వీరిద్దరు అయినా పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.

జాన్వీకపూర్..

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురుగా జాన్వీకపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె మొదట్లో పెద్దగా హిట్లు అందుకోలేదు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె శిఖర్ పహారియాతో డీప్ డేటింగ్ చేస్తోంది. ఆయన మాజీ సీఎం మనవడు. కాగా వీరిద్దరూ పబ్లిక్ గానే తిరుగుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడుస్తోంది. కానీ ఆ విషయం ఇప్పట్లో బయటకు వచ్చేలా లేదు.

అదితి రావు హైదరీ..

అదితి కూడా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి హిట్లు కూడా అందుకుంది. అయితే వ్యక్తిగతం మాత్రం ఆమె వివాదాల్లోనే ఉంటుంది. ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం సిద్దార్థ్ తో ప్రేమలో పడిపోయింది. సిద్దార్థ్ తక్కువోడేం కాదండోయ్.. ఇంతకు ముందే చాలా మందితో డేటింగ్ చేసి వదిలేశాడు. ఇప్పుడు ఈమెతో చేస్తున్నాడు. వీరిద్దరు అయినా పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.

మలైకా అరోరా..

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇంతకు ముందే సల్మాన్ తమ్ముడితో పెళ్లి అయింది. ఓ కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి తన కంటే 13 ఏళ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది మలైకా. వీరిద్దరూ బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటున్నారు. యాభై ఏళ్ల వయసులో కూడా ఆమె కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తోంది. మరి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News