Birth Control Pills Facts : పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఎంత డేంజరో తెలుసుకోండి..!

Qubetvnews - February 29, 2024 / 07:27 PM IST

Birth Control Pills Facts : పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఎంత డేంజరో తెలుసుకోండి..!

Birth Control Pills Facts :

ఈ రోజుల్లో చాలామంది పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. దాంతో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు కండోమ్ వాడటం కూడా ఇష్టం ఉండక.. ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కేవలం పెళ్లైన దంపతులు మాత్రమే కాదు ఈ రోజుల్లో లివింగ్ రిలేషన్ లో ఉంటున్న వారు కూడా ఇలాంటి ట్యాబ్లెట్లనే వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ట్యాబ్లెట్లను ఎలాంటి సందర్భంలో వాడాలో కూడా వారికి తెలియదు. ఏం కాదులే అన్న భరోసాతో ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్లను వాడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

మరీ ఎక్కువగా వాడేస్తే మాత్రం శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కనీసం డాక్టర్ సలహాలు తీసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మాత్రం కచ్చితంగా భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు డాక్టర్లు. ఈ రోజుల్లో మార్కెట్లో లభించే గర్భనిరోధక మాత్రలు, వీటిని మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అని కూడా అంటారు. అయితే వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వేసుకోవాలి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బఠానీలు వేసుకున్నట్టు వేసుకోవద్దని చెబుతున్నారు డాక్టర్లు. కాగా ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు.

వీటి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతే కాకుండా పీరియడ్స్ సమస్య కూడా వస్తుందంట. పీరియడ్స్ సమయానికి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్ లో అసలు గర్భం రాకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే ఈ మాత్రలను రెగ్యులర్ గా వాడకుండా కండోమ్ వాడేందుకు ఇంట్రెస్ట్ చూపించాలి. ఒకవేళ సెక్స్ చేసే సమయంలో కండోమ్ విరిగిపోతే మాత్రం ఎమర్జెన్సీ పిల్ ను నెలకు ఒకసారి మత్రమే వాడాలి. మరీ అవసరం అనుకుంటే రెండుసార్లు మాత్రమే వాడాలి.

సాధారణంగా స్త్రీలు వేసుకునే ఈ మాత్రలు 21 రోజుల షెల్ప్‌ జీవితాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. సాధారణంగా ఒక మాత్ర వేసుకున్న తర్వాత ఏడు రోజులు గ్యాప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఇలా వేసుకోవడం వల్ల అవాంఛనీయ గర్భం రాకుండా ఉంచేందుకు ఇవి సాయం చేస్తాయి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే మాత్రం కచ్చితంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News