Health Tips : షుగర్ వ్యాధి ఉన్న వారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసా..!
Qubetvnews - February 19, 2024 / 07:16 PM IST
Health Tips :
ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. పది మందిలో కనీసం నలుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ డయాబెటిక్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ , 2 టైప్ 2 డయాబెటీస్. టైప్-1 రావడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇది జీన్స్ వల్ల కూడా వస్తుంది. కానీ టైప్-2 అనేది మాత్రం మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ కారణంగానే వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది టైప్-2తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి…
అల్లం వెల్లుల్లి అనేది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు బాగానే సాయం చేస్తుంది. కాబట్టి ఇది షుగర్ ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవాలి.
అల్లం…
అల్లం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు చేసే ఔషధ గుణం ఉన్న ఆహారం. ఇది షుగర పేషెంట్లు తప్పకుండా తీసుకోవాల్సిందే. షుగర్ ఉన్న వారు కచ్చితంగా అల్లం టీ, జ్యూస్ లను తాగిగే బెటర్ గా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్లాన్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు సాయం చేస్తుంది.
లవంగాలు…
లవంగాలు కూడా షుగర్ పేషెంట్లకు బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఇందులో చాలానే ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే బాడీలో ఇన్సులిన్ హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేసే విధంగా సాయం చేస్తుంది. దాంతో పాటు రక్తంలో షుగర్ ను బాగానే కంట్రోల్ చేస్తుంది.
మెంతులు…
మెంతులు అనేవి షుగర్ పేషెంట్లకు బాగానే మేలు చేస్తాయి. టైప్-2 షుగర్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఇవి కూడా ఉన్నాయి. మెంతుల్లోని ఫైబర్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సాయం చేస్తుంది.
పసుపు…
పసుపు ఎన్నో ఔషధాల గుణం కలిగి ఉంటున్నది. షుగర్ ఉన్న వారు కచ్చితంగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే పసుపుకు బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో బాగా సాయం చేస్తుంది. పసుపు ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా ఎక్కువగా తీసుకోవాలి.
దాల్చిన చెక్క…
కూరలో వాడే మసాలా దినుసు అయిన దాల్చిన చెక్కకు కూడా డయాబెటిక్ ను కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. రక్తంలో చెక్కర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇది బాగానే సాయం చేస్తుంది. అందుకే డయాబెటిక్ ఉన్న వారు కచ్చితంగా తీసుకోవాల్సిన దాంట్లో ఇది కూడా ఉంటుంది.





