Quitting Alcohol : సడెన్ గా మందు బానేస్తున్నారా.. లాభాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయండోయ్..!

Qubetvnews - February 18, 2024 / 01:23 PM IST

Quitting Alcohol : సడెన్ గా మందు బానేస్తున్నారా.. లాభాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయండోయ్..!

Quitting Alcohol :

ఈ రోజుల్లో మద్యపానం అనేది ప్రతి ఒక్కరికీ ఓ వ్యసనంగా మారిపోయింది. చాలా మంది మద్యం లేకుండా ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. అయితే మద్యం సేవించడం వల్ల చాలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రేగులు, కాలేయం, తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటాయి. కొందరు అయితే మానసిక సమస్యలను కూడా ఎదుర్కుంటారు. ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టే చాలా మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరు సడెన్ గా మద్యం మానేస్తుంటారు. అలాంటి వారికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయోజనాలు..

గుండె సమస్యలు…

మద్యం మానేయడం వల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మందు మానేస్తే బాడీలోని అధిక రక్తపోటు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సాధారణంగా ఆల్కాహాట్ తీసుకుంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు స్థాయి పెరుగుతుంది. ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కాహాల్ మానేస్తేనే బెటర్. కాకపోతే ఒక్కసారే మానేయకుండా దశల వారీగా మానేయాలి.

కాలేయ ఆరోగ్యం..

మద్యం సేవిస్తే కాలేయం తీవ్రంగా దెబ్బ తింటుంది. కాలేయం అనేది మన బాడీలో విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే ఆల్కాహాల్ తీసుకోవడంతో బాడీలో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆల్కాహాల్ నే మ ఆనేస్తే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

మానసిక ఆరోగ్యం..

మద్యం తాగితే మానిసికంగా స్థిమితంగా ఉండలేరు. మద్యం అనేది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కాకుండా ఏకాగ్రత సమస్యలను కూడా తీసుకువస్తుంది. వ్యక్తి పనితీరుపై ఈ ప్రభావం పడుతుంది. అం దుకే ఆల్కాహాల్ తీసుకోకపోవడం వల్ల బాడీలో హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉంటాయి. మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

నిద్రలేమి సమస్యలు దూరం..

చాలా సర్వేలు చెప్పిన దాని ప్రకారం.. మద్యం తీసుకుంటే నిద్ర నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఆల్కాహాల్ వల్ల మెదడు నరాలపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆరోగ్యమైన నిద్ర కావాలంటే మాత్రం కచ్చితంగా ఆల్కాహాల్ ను మానేయాలని డాక్టర్లు చెబుతున్నారు.

సడెన్ గా మానేస్తే వచ్చే సమస్యలు..

సడెన్ గా మద్యం మానేస్తే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి.. విపరీతంగా చెమటలు పడుతాయి. దాంతో పాటు గుండె వేగం కూడా పెరుగుతుంది. మానసికంగా కొత భాయాందోళన లాంటివి కలుగుతాయి. ఇక తలనొప్పి, వాంతులు, అధిక రక్తపోటు లాంటివి కూడా కొందరికి వచ్చే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

కాబట్టి ఒకేసారి మద్యం మానేయకుండా దశల వారీగా మద్యం మానేస్తేనే బెటర్ అని చెబుతున్నారు డాక్టర్లు. అంటే తాగడం అనేది మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రావాలి. ఈ సమయంలో అధికంగా వాటర్ తాగడం, వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా మద్యం మానేసినా ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News