Health Tips : థైరాయిడ్ ఉన్న వారు అన్నం తినొద్దా.. తింటే ఏమవుతుంది..?
Qubetvnews - February 27, 2024 / 07:52 PM IST

Health Tips :
ఈ రోజుల్లో చాలా మంది అన్నం ను ఎక్కువగా తినేస్తున్నారు. మన దేశంలో చాలా మంది మూడు పూటలు అన్నమే తింటుంటారు. దాంతో అన్నం తినడం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కునే వారు కూడా ఉన్నారు. ఇంక మరీ ముఖ్యంగా థైరాయిడ్ రోగుల గురించి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వారు రకరకాల ఆలోచనలతో ఉంటుంటారు. వారు అన్నం తింటే మళ్లీ థైరాయిడ్ ఎక్కువ అవుతుందేమో అనే అనుమానాలతో అన్నం తినడాన్ని చాలా మంది మానేస్తుంటారు.
అయితే ఇలా అన్నం నిజంగానే మానేయాలా వద్దా అనేది కూడా వారికి తెలియదు. వారికి వారే ఏదో తెలిసినంతలో నిర్ణయాలు తీసేసుకుంటారు. నిజంగానే ఇలాంటి సమస్యలు ఉన్న వారు అన్నం తినొద్దా అంటే దానికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం తినొద్దా..?
చాలామంది బరువు తగ్గాలనుకునేవారు ఆటోమేటిక్ గా తిండి తగ్గిస్తుంటారు. కాగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు కూడా అన్నం తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అన్నం తినాలని అనుకుంటే వైట్ రైస్ ను కాకుండా బ్రౌన్ రైస్ ను తెచ్చుకుని తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
బియ్యంలో గ్లూటెన్…
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అన్నంలో గ్లూటెన్ ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నం తింటే థైరాయిడ్ సమస్య ఇంకాస్త ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ కారణాల వల్లనే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ తినాలని అనుకుంటు బ్రౌన్ రైస్ తినొచ్చు.
బరువు పెరగొచ్చు…
అన్నం అంటేనే పిండి పదార్థం. ఇది మన కడుపులో ఈజీగా అరిగిపోతుంది. కాబట్టి మనం మూడు పూటలా అన్నం కాస్త ఎక్కువగా అంటే కడుపు నిండా తినేస్తుంటాం. ఇలా తినడం వల్ల బరువు ఆకస్మికంగానే పెరిగిపోతుంటాం. కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు అన్నం తినకపోతేనే మంచిది.
థైరాయిడ్ పెరుగుతుంది…
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే థూరాయిడ్ సమస్యలు అన్నం తింటే కచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి మూడు పూటలా అన్నం తినకపోవడమే బెటర్. అలా కాదని అన్నమే మూడు పూటలా తింటే మాత్రం కచ్చితంగా థైరాయిడ్ సమస్యతో పాటు టైప్-2 డయాబెటిక్ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
అన్నాన్ని ఎలా వండి తినాలి?
అన్నం తినడం మీకు ఇష్టం అయితే మాత్రం అన్నంను నేరుగా వండుకుని తినొద్దు. దాన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసుకుని తింటే సరిపోతుంది. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం చుట్టూ కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుని తింటే థైరాయిడ్ ఎక్కువ కాకుండా ఉంటుంది.