Hair Tips : ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరగాలా.. ఇలా చేయండి చాలు..!

Qubetvnews - February 21, 2024 / 03:42 PM IST

Hair Tips : ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరగాలా.. ఇలా చేయండి చాలు..!

Hair Tips  :

ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే ఇవి కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా జుట్టు రాలే సమస్యలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక జుట్టు రాలిపోతే ఆ బాధ వర్ణానాతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందంగా కనిపించాలి అంటే కచ్చితంగా జుట్టు ఉండాల్సిందే. జుట్టు లేకపోతే అందంగా కనిపించలేరు. అందుకే చాలా మంది జుట్టు రాలిపోతుంటే ఆపేందుకు నానా పాట్లు పడుతుంటారు. జుట్టు రాలిపోకుండా ఉండేందుకు మెడిసిన్ కూడా వాడుతుంటారు కొంత మంది. కాగా ఇలా జుట్టు రాలిపోయినా మంచిగా పెరగాలంటే కొన్ని టిప్స్ వాడాలి. అవేంటో చూద్దాం.

ఆయిల్ మసాజ్..

జుట్టు బాగా పెరిగేందుకు ఆయిల్ మసాజ్ అనేది బాగానే ఉపయోగపడుతుంది. అయితే ఆయిల్ రాయడం మామూలుగా నెత్తికి పెట్టుకున్నట్టు కాకుండా.. మసాజ్ చేసుకవాలి. ఏదైనా కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్, బాదం నూనె లాంటిది పెట్టుకుని బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడు మన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు హెయిర్ పెరిగేందుకు ఛాన్స్ ఉంటుంది.

హెల్దీ డైట్..

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మనకు ఎంత హెల్తీ ఫుడ్ ఉంటే అంత మంచిది. మనం పై నుంచి ఎన్ని ట్రీట్ మెంట్స్ తీసుకున్నా సరే జుట్టుకు శక్తి లోపలి నుంచి రావాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలసి ఉంటుంది. జింక్, ప్రోటీన్లు, బయోటిన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.

షాంపూ..

చాలా మంది షాపులకు వెళ్లి ఏదో ఒక రకం షాంపూను తెచ్చి వాడుకుంటూ ఉంటారు. వాటి వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహజంగా కెమికల్స్ లేకుండా ఉండే షాంపూలను వాడుకోవాలి. అప్పుడే జుట్టుకు జీవం వచ్చి బాగా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి.

మంచి నిద్ర..

మన జుట్టును మంచి నిద్ర కూడా ప్రభావితం చేస్తుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో చాలా మందికి సరైన నిద్ర లేక చాలా రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. రోజులో కనీసం 8గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతుంటాయి.

వ్యాయామం..

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వ్యాయామం చేస్తే జుట్టు రాలిపోతుందని అనుకుంటారు. కానీ రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే మాత్రం కచ్చితంగా జుట్టుకు శక్తి లభిస్తుంది. యోగా లేదా వ్యాయామాలు బాగా చేస్తే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేరుతుంది. దాని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News