Ambani wedding : అంబానీ వారి పెళ్లి విందులో 2500 రకాల వంటకాలు
Qubetvnews - July 10, 2024 / 08:42 PM IST
Ambani wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్ అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి గురించి గత రెండు మూడు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. వివాహ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి కూడా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ పేరుతో దేశ విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాబోయే వధువరులు సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. జులై 12న అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహం వైభవంగా జరగబోతుంది.
సంగీత్ కార్యక్రమం కోసం వందల కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి మరీ విదేశాల నుంచి కళాకారులను రప్పించిన అంబానీ ఫ్యామిలీ పెళ్లి విందులో అంతకు మించి అన్నట్లుగా జాగ్రత్తలు తీసుకుంటుందట. పది కాదు, వంద కాదు ఏకంగా 2500 రకాల వంటకాలను పెళ్లికి వచ్చిన అతిధులకు రుచి చూపించబోతున్నారట. వివిధ సెక్షన్ లుగా ఫుడ్ ను విభజించి ఏకంగా 2500 రకాల వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారట. విదేశీ ఫుడ్ ఐటెమ్స్ మొదలుకుని కాశీ ఛాట్ ను కూడా మెను లో చేర్చారట. వారణాసిలో ప్రసిద్ది చెందిన కాశీ ఛాట్ ను అంబానీ వారి ఇంటి వేడుకలో చేర్చడం ద్వారా అందరి దృష్టి ఇప్పుడు ఆ డిష్ పై పడింది. చాలా మంది గూగుల్ చేసి మరీ ఆ డిష్ గురించి తెలుసుకుంటున్నారు.
ఇంకా దేశ వాలీ ఫుడ్ అయిన కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ ఇలా విభిన్నమైన వంటకాలను రుచి చూపించబోతున్నారు. ఇప్పటికే ముంబై బాంద్రాలోని కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో దేశ విదేశాలకు చెందిన వంట వారు చేరుకున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలకు హాజరు అవుతున్న అతిథులకు తమ వంటకాలను రుచి చూపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జియో కన్వెన్షన్ లో ప్రతి రోజు వందల కొద్ది వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారట. పెళ్లి రోజు అంటే జులై 12న ఏకంగా 2500 లకు పైగా వంటకాలను సిద్దం చేస్తున్నారు. అనంత్ అంబానీ పెళ్లిని ఇంత భారీగా ఖర్చు పెట్టి చేసేందుకేనా జియో టెలికాం వినియోగదారుల నడ్డి మీద రేట్ల పెంపు నిర్ణయాన్ని మోపింది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలను పెళ్లి కోసం ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.





