Brs : ఆ విషయాన్ని వాడుకోని బీఆర్ ఎస్.. కారణం ఏంటి..?
Qubetvnews - July 28, 2024 / 12:47 PM IST
Brs : బీఆర్ ఎస్ కు ఇప్పుడు ఎన్నో విషయాలపై పోరాడేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా చూసుకుంటే బీఆర్ ఎస్ మాత్రం వాటిపై బలంగా పోరాడట్లేదని తెలుస్తోంది. కారణాలు ఏమైనా సరే బీఆర్ ఎస్ మాత్రం ఇప్పుడు కామెంట్లు చేయడం వరకు మాత్రమే ఆగిపోతోంది తప్ప.. బలమైన పోరాటాలు మాత్రం ఆ పార్టీ నుంచి అస్సలు కనిపించట్లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో ఏ మాత్రం నిధులు కూడా కేటాయించలేదు. దానిపై కేవలం ఒక కామెంట్ చేసి బీఆర్ ఎస్ ఊరుకుంది. దానిపై కేసీఆర్ కూడా బలంగా మాట్లాడలేకపోయారు.
ఒకవేళ ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినట్టు అయితే బీఆర్ ఎస్ కు గ్రాఫ్ పెరిగేది. ఇదే విషయం మీద ఒక కామెంట్ చేసి ఊరుకోవడం అంటే మరీ దారుణం. ఎందుకంటే పక్కనే ఉన్న ఏపీకి మాత్రం కేంద్రం రూ.15వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనిపై తెలంగాణ ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. అదే అసంతృప్తిని ఆసరాగా చేసుకుని బీఆర్ ఎస్ పార్టీ పోరాడితే మాత్రం వారికి ప్రజల్లో సానుభూతి ఏర్పడేది. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ పోరాడలేదు కాబట్టి ఆ అంశాన్ని బీఆర్ ఎస్ ఆసరాగా తీసుకుని ఉంటే బాగుండేది.
కానీ బీఆర్ ఎస్ దీన్ని లైట్ తీసుకుంది. రాజకీయాల్లో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటేనే ఏ పార్టీకి అయినా మనుగడ అనేది సాధ్యం అవుతుంది. లేదంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు బీఆర్ ఎస్ కాంగ్రెస్ మీద పోరాడుతోంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మీద మాత్రం పోరాడటానిక పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాగే కొనసాగితే మాత్రం రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి అడుగులు వేయట్లేదు. ఇప్పటికైతే బీఆర్ ఎస్ పార్టీకి పెద్దగా పోరాడేందుకు అవకాశాలు మాత్రం బాగానే ఉన్నాయి.
కానీ ఎందుకో వాటిని సక్సెస్ ఫుల్ గా వాడుకోవట్లేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ కూడా జాతీయ పార్టీలే. కాబట్టి ఆ రెండు జాతీయ పార్టీలతో పోరాడుతున్నందున బీఆర్ ఎస్ కూడా బలంగానే జాతీయ స్థాయిలో కూడా విమర్శలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి అన్ని విధాలుగా పవర్ దక్కుతుందని గుర్తు పెట్టుకోవాలి.





