MP Lavu Sri Krishna Devarayalu : టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ కరువు? వైసీపీదే పక్కా గెలుపనే భయం గట్టిగానే ఉన్నట్టుందిగా !………
Qubetvnews - April 25, 2024 / 05:42 PM IST
MP Lavu Sri Krishna Devarayalu :
ఏపీ ఎన్నికల వేడి సమ్మర్ హీట్ ని డామినేట్ చేస్తోంది. పోటా పోటీ నామినేషన్లు, విమర్శలు ప్రతివిమర్శలు, కామెంట్లు కౌంటర్లతో ఎటు చూసినా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. ఎక్కడ విన్నా ఆ టాపికే వినిపిస్తోంది. అయితే ఎవరు గెలుస్తారు? మళ్లీ ఎవరు సీఎం పీఠాన్ని వరిస్తారంటూ ఈ ఏడాది మొదటి నుంచీ చాలా చర్చలు జరిగాయి. విశ్లేషకుల లెక్కలు, సర్వేల ఫలితాలతో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కానీ ఎప్పుడైతే జగన్ సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ప్రజల్లో కెళ్లి ప్రచారం చేశాడో అప్పటినుంచీ వార్ వన్ సైడయిందనేది లేటెస్ట్ టాక్.
2019లో పాదయాత్ర ద్వారా పవర్లోకిచ్చిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో మరోసారి ప్రజాభిమానాన్ని చూరగొని రెండోసారి సీఎం సీటు దక్కించుకోబోతున్నాడని సర్వేల సారాంశం. దీంతో టీడీపీ క్యాడర్లోనే కాదు.. అభ్యర్థుల్లోనూ కాన్ఫిడెన్స్ కరువైంది. ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ చేసిన వ్యాఖ్యలివి అంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన వార్తలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరలవుతున్నాయి.
మీ ఇంటికి మేలు జరిగితేనే, వైసీపీ వల్ల సంక్షేమం అందితేనే మాకు ఓటేయండి అంటూ జగన్ చేస్తోన్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అనవసర అబద్ధపు మాటలు, అమలు కాని హామీల ప్రసంగాలు కాకుండా.. ఏం చేశాం, ఏం జరిగింది. ఇక ముందు ఏం చేస్తాం అంటూ వైఎస్ జగన్ క్రిస్టల్ క్లియర్ గా జనాలకి చెప్తుండడంతో వైసీపీ వైపే గెలుపు పవనాలు వీస్తున్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్లోనే కొత్త జోష్ కనిపిస్తోంది. జగన్ చేసిన సంక్షేమం, అందించిన పథకాలు, చేసిన అభివ్రుద్ధి ప్రస్పుటంగా కనిపిస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడే అవకాశం లేకుండా పోయింది.
మరోవైపు కూటమి వల్ల కుంపటి పెట్టుకున్నట్టయిందని పొత్తు కూడిన మూడు పార్టీలు లోపల్లోపల మదనపడి పోతున్నాయి. ఒకట్రెండు సీట్ల బలం కూడా లేని జనసేన, బీజేపీలతో పొత్తేంటి అంటూ టీడీపీ క్యాడర్ కూడా గుర్రుగానే ఉంది. పైగా పార్టీ కోసం ఏళ్ల పాటు కష్టపడ్డ వాళ్లకి కాకుండా పొత్తు ధర్మం అంటూ సీట్లు ఎవరెవరికో ఇస్తున్నారని కార్యకర్తలే కడుపుమంటతో ఉన్నారు. చాలా చోట్ల చంద్రబాబు ప్లెక్సీలు తగలబెట్టి, చెప్పుతో కొట్టి తమ కోపాన్ని ప్రదర్శించారు కూడా. ఇగ పవన్ లాంటి ఆవేశపు స్టార్ ని పొత్తులో చేర్చుకుని నష్టమే తప్ప లాభం లేదని సైకిల్ పార్టీలో ఓపెన్ టాక్ నడుస్తోంది.
ఇలాంటి సమయంలో నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీక్రిష్ణదేవరాయలు వ్యాఖ్యలివి అంటూ.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే చాలా కష్టపడాలి. ఎన్డీయే కూటమిలో కలిసినా అంతగా మేలైతే ఏమీ జరగదు అని ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలయ్యాయి. దాంతో టీడీపీ అభ్యర్థులకే తమ గెలుపుపై నమ్మకం లేదు, వాళ్లలో వాళ్లు కొట్టుకోడానికే సమయం సరిపోవట్లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి బలహీన ప్రతిపక్షాలు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే జగన్ ను ఓడిస్తాయా అంటూ వైసీపీ వర్గాలు కూడా ఈ కథనాన్ని వైరల్ చేస్తున్నాయి.





