YS Jagan : మ్యానిఫెస్టో అంటే పార్టీ కరపత్రం కాదు బాబూ.. జగన్ ని చూసి నేర్చుకో

Qubetvnews - April 28, 2024 / 05:09 PM IST

YS Jagan : మ్యానిఫెస్టో అంటే పార్టీ కరపత్రం కాదు బాబూ.. జగన్ ని చూసి నేర్చుకో

YS Jagan :

ఎన్నికల్లో ప్రతి పార్టీ మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడం మామూలు విషయం కాదు. ఏపీలో జగన్ పాలన, బాబు పాలన చూసిన ప్రజలెవరైనా ఇద్దరిలో ఎవరు హామీల్ని అమలు పర్చిన అసలైన నేతగా జగన్ నే విశ్వశిస్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చక పోగా మ్యానిఫెస్టోని డిలీట్ చేసిన మహానుభావుడిగా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు బాబు. కానీ అమలు కాని హామీలనివ్వడం చేతకాకే అలాంటి మ్యానిఫెస్టో రూపొందించలేదని కూడా తాజాగా మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు జగన్.

2019లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రజల బాగు కోరే పథకాలతో మ్యానిఫెస్టో రూపొందించిన జగన్ జనాల విశ్వాసాన్ని పొందగలిగాడు. ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే చెప్పిన ప్రతి హామీని, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ అధికారాన్ని కట్టబెట్టిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడు. దాంతో మీ ఇంట్లో మా వల్ల మంచి జరిగిందనిపిస్తేనే ఓటు వేయండి అంటూ ప్రచారంలో పదే పదే చెప్పుకొస్తున్నాడు జగన్. తన పాలన పట్ల, హామీల అమలు పట్ల జగన్ కున్న నమ్మకమది. మంచి చేస్తే జనాలు మళ్లీ అధికారాన్ని అప్పజెప్తారన్న భరోసా ఆయనది. ఇప్పటివరకు అందించిన సంక్షేమాన్ని మరింత పెంచుతూ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోని రూపొందించారు జగన్.

మ్యానిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్తూ అంతే పవిత్రంగా భావిస్తున్న జగన్ పై ప్రజలు కూడా విశ్వాసంతో ఉన్నారు. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అన్న మాట ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. 2014 నుంచి ఐదేళ్ల పదవీ కాలంలో బాబు హామీలు అమలుపర్చిన తీరును, 2019 నుంచి జగన్ మ్యానిఫెస్టోని అమలు పర్చిన తీరును పోలిస్తే ఎవరిది ప్రజా పాలనో తెలిసిపోతుంది. జనాలని నమ్మించి ముందు ఓట్లేయించుకుంటే చాలు.. ఆ తర్వాత ఎలాగూ ఆ హామీలని నెరవేర్చం కదా అన్న కుట్రతో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చే బాబు స్ట్రాటెజీని ఈ ఎన్నికల్లో బలంగా తిప్పికొట్టేందుకే ఏపీ ప్రజలు ఫిక్సయ్యారని సర్వేల సారాంశం కూడా.

మ్యానిఫెస్టో అంటే ఎన్నికల కరపత్రం కాదనీ, ఓట్లయ్యాక డిలీట్ చేసే పోస్ట్ కాదనీ, జగన్ ని చూసి నేర్చుకో బాబూ అంటూ అటు ప్రచారంలో ప్రజలు, ఇటు సోషల్మీడియా నెటిజన్స్ కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ ని కామెంట్లతో కడిగిపారేస్తున్నారు. ఆయన కన్నా జనాలు తెలివైన వాళ్ళని బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో?

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News