Ys Jagan : జగన్ కు ఐదేండ్లు పెద్ద టాస్క్.. తట్టుకుని నిలబడగలడా?
Qubetvnews - June 26, 2024 / 09:34 AM IST
Ys Jagan : తానొకటి తలిస్తే… దైవం ఒకటి తలిసింది… అన్నట్లు తయారైంది ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. “వై నాట్ 175” అంటూ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కి వెళ్ళిన జగన్ కు రాష్ట్ర ప్రజలు నమ్మశక్యం కానీ రిజల్ట్ ను చవి చూపించారు. కేవలం 11ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కళ్ళకు కడుతుంది.
వీటన్నింటికి తోడు ఆయనకు తనపై ఉన్న కేసులను చూసుకుంటూ… మరోవైపు పార్టీని వీడాలని చూసే నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారనుంది. రాజకీయంలో అనేక మంది నేతలు అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే వారే ఎక్కువ ఉంటారు.
వీరిని పక్క పార్టీల వైపు చూడకుండా చేయడం, అయిదేళ్ళు కాపాడుకోవడం అనేది ఇప్పుడు జగన్ ముందు ఉన్న పెద్ద టాస్క్.
ఓటమికి కారణాలు
వైసీపీ అధినేత సంక్షేమ అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆర్ధికవృద్ధిని విస్మరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. ఇదే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయలేకపోయారు. కొందరి నాయకుల దురుసుతనం, మాటల దాడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. కేవలం జగన్ ను నమ్మి ఓట్లు ఏసే పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. అనేక స్థానాల్లో ఓటమి చెందారు. గెలిచిన స్థానాల్లో గతంలో కన్నా మెజారిటీ తగ్గిపోయింది. కూటమి నేతలను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గుర్తించలేక పోయాం అని జగనే స్వయంగా చెప్పడం పరిస్థితికి అద్దం పడతుంది.
నేతలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్
గతంలో అధికారంలో ఉండి, పదవులు అనుభవించిన నేతలు నేడు ఓడిపోవడంతో కంగుతిన్నారు. అధికార పార్టీలో ఉంటే పదవులు, మర్యాద అన్ని దొరుకుతాయి. ఈ కారణంతో ప్రస్తుతం గెలిచిన పార్టీలోకి ఓడిన నేతలు వెళ్ళడం సాధారణం అయిపోయింది. ఇదే జగన్ కు అతి పెద్ద దెబ్బ సమస్య కానుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోగా అయిదేళ్ళు అయిపోతయని మాజీ సీఎం అన్నంత సులభం కాదని ఆ పార్టీ నేతలకూ తెలుసు. అయిదేళ్ళు ఓడిన పార్టీలో ఉండటం కంటే అధికార పార్టీలోకి వెళ్లి ఏదైనా ఓ పదవిని పొందవచ్చావని అనుకునేవారిని ఆపడం కష్టంగా మారనుంది.
పార్టీ సమావేశాలు పెట్టి నాయకుల్లో దైర్యాన్ని నూరిపోస్తూ, నమ్మకాన్ని కొల్పొకుండా పోరాడుదాం అని జగన్ ఎన్ని మాటలు చెప్పిన నేతల మనసుల్లో ఎం ఉందో ఎవరు కనిపెట్టగలరు. దీనికి తోడు రానున్న కాలంలో పెరగనున్న నియోజకవర్గాల పెంపు మరో తలనొప్పి తెచ్చిపెట్టనుందనే చెప్పాలి. కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో సీట్ ఇస్తామన్న మాటతో వైసీపీ పార్టీలోని కీలక నేతలనూ టీడీపీ, కూటమిలోని ఇతర పార్టీలు తమ వైపుకు తిప్పుకునే అవకాశాలే ఎక్కువ. మరి వీటన్నింటినీ దాటుకొని జగన్ ఎలా నిలబడగలడు అనేది వేచి చూడాల్సిందే…




