Ys Jagan : కొత్త లుక్ లో జగన్.. స్టైలిష్ గా ఉన్నాడంటున్న వైసీపీ శ్రేణులు..
Qubetvnews - July 2, 2024 / 01:53 PM IST
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపునైనా, ఓటమినైనా సమానంగానే చూస్తుంటారు. ఎందుకంటే ఆయన తన రాజకీయ జీవితంలో అధికారంలో కంటే కూడా.. ప్రతిపక్షంలోనే ఎక్కువగా గడిపారు. అందుకే జగన్ కు అధికారం కొత్త కాదు.. ప్రతిపక్షం అంత కన్నా కొత్త కాదు. అందుకే ఆయన అధికారం కోల్పోయినా సరే గుండె నిబ్బరం మాత్రం కోల్పోవట్లేదు. ఫలితాలు వచ్చిన రోజునే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనకు అధికారం కోల్పోయినందుకు బాధ లేదని చెప్పేశారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ నేతలను ఆయన ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ ఉన్న తన నివాసంలో ప్రస్తుతం కొంత సమయం గడుపుతున్నారు. అయితే అక్కడకు కూడా ఆయన అభిమానులు తరలి వెళ్తున్నారు. ఆయన్ను కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ కూడా ఓపికగా అందరినీ కలుస్తున్నారు. తనతో ఫొటోలు దిగాలనుకునే అందరికీ ఫొటోలు కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో జగన్ కేవలం వైట్ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంట్ లో మాత్రమే కనిపించేవారు. ఎక్కడకు వెళ్లినా ఆ డ్రెస్ కోడ్ ను వాడేవారు.
కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా తన డ్రెస్ స్టైల్ ను మార్చేశారు. ఇందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామాతో మాజీ సీఎం జగన్ కనిపించారు. అయితే గతంలో ఇలాంటి లుక్ ను ఎన్నడూ చూడలేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో కాస్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు జగన్. దాంతో తమ నాయకుడు లుక్ మార్చాడని.. ఇక రాబోయే రోజుల్లో కొత్త రాజకీయాలు కూడా మొదలవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. మరి ఆయన కొత్త లుక్ మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.




