Ys Jagan : అయ్యన్న పాత్రుడిని ఇబ్బందుల్లో పడేసిన జగన్.. ఇస్తే ఓ బాధ.. ఇవ్వకుంటే ఓ బాధ..!

Qubetvnews - June 28, 2024 / 08:37 PM IST

Ys Jagan : అయ్యన్న పాత్రుడిని ఇబ్బందుల్లో పడేసిన జగన్.. ఇస్తే ఓ బాధ.. ఇవ్వకుంటే ఓ బాధ..!

Ys Jagan : ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. బహుషా ఏపీ రాజకీయాల్లో లోకల్ పార్టీలు వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం చర్చలు జరగడం ఇదే మొదటిసారి కాబోలు. ఎందుకంటే జగన్ కు మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో అసలు జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది అందరిలోనూ టెన్షన్ గా మారిపోయింది. ఇక టీడీపీ కూడా ముందు నుంచి దీనిపై రకరకాలుగా ప్రచారాలు చేస్తూ వచ్చింది.

సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్లలో 10 శాతం వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందని తెలిపారు. అటు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. కానీ దానిపై సీఎం చంద్రబాబు గానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గానీ మాట్లాడట్లేదు. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పందించలేదు. ఇంతలోనే జగన్ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సుదీర్ఘ లేఖను రాశారు స్పీకర్ కు. అసలు 10 శాతం సీట్లు రావాలనే రూల్ ఎక్కడా లేదని.. గతంలో ఎవరూ పాటించలేదని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు.

దాంతో ఇప్పుడు అయ్యన్న పాత్రుడిని ఇరకాటంలో పడేసినట్టు అయిపోయింది. ఎందుకంటే శాసన సభ స్పీకర్ గా ఆయన కచ్చితంగా దానిపై స్పందించాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూటమి ప్రభుత్వం అనుమతి ఆయనకు అవసరం. ఒకవేళ తానే స్పీకర్ కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇస్తే పార్టీ నుంచి ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే.. జగన్ కోర్టులకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు చట్ట ప్రకారం స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు కూడా కోర్టుకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

చట్టం ప్రకారం ఇవ్వాలి అని కోర్టులు చెబితే.. అది రాజకీయంగా అయ్యన్న పాత్రుడికి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడికి ఇబ్బందులు తప్పవంటున్నారు న్యాయ నిపుణులు. మరి ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News