Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు సెన్సేషనల్ న్యూస్.. పుష్ప-3 కూడా రాబోతోందా..?

Qubetvnews - February 17, 2024 / 10:53 AM IST

Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు సెన్సేషనల్ న్యూస్.. పుష్ప-3 కూడా రాబోతోందా..?

 Allu Arjun :

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మొదటి పార్టు పుష్పది రైజ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పాన్ఇండియా వైడ్ గా దుమ్ము లేపింది ఈ సినిమా. కేవలం ఇండియాలోనే కాకుండా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే రెండో పార్టు కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు సుకుమార్ బాగానే కష్టపడుతున్నారు. అన్ని సీన్లను పకడ్బందీగా రూపొందిస్తున్నారు.

మరోసారి పాన్ఇండియా వైడ్ గా దుమ్ము లేపాలనే ఉద్దేశంతో ఆ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక రెండో పార్టులో సుకుమార్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంటున్నారు. మొదటి పార్టులో ఉండే పుష్ప మేనరిజం, సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు రెండో పార్టులో కూడా అలాంటి సీన్లను క్రియేట్ చేస్తున్నారంట సుకుమార్. కాగా ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదేంటంటే ఇప్పుడు పుష్ప సినిమాకు పార్ట్-3 కూడా రాబోతోందంట. సుకుమార్ ఇందుకోసం కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కథ పరంగా పుష్ప-2లో అన్ని సీన్లను పొందుపరచడం వీలు కావట్లేదు కాబట్టి మూడో పార్టు తీయాలని భావిస్తున్నారంట సుకుమార్. ఇందుకోసం అన్ని ప్లాన్లు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటి పార్టు క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ తో గొడవతో ముగించారు. ఇప్పుడు రెండో పార్టులో క్లైమాక్స్ లో కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ క్లైమాక్స్ ను చూడబోతున్నామని తెలుస్తోంది. అంటే పుష్పరాజ్ రెండో పార్టులో నేషనల్ గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఇండియాలో సిండికేట్ వ్యాపారాన్ని నడిపించే వ్యక్తిగా ఎదుగుతాడు. అయితే మూడో పార్టులో మాత్రం ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ గా మారే షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పుడు రెండో పార్టు షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది. కాగా ఇప్పుడు క్లైమాక్స్ సీన్ల కోసం జపాన్ వెళ్లింది మూవీ టీమ్. అక్కడే క్లైమాక్స్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. జపాన్ లోనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదుగుతాడని.. అప్పుడు ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్లతో గొడవ పడుతాడని తెలుస్తోంది.

ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్లతో గొడవను మూడో పార్టులో చూపించబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ మూడు పార్టులకు ఆర్ ఆర్ ఆర్ రోర్ ను ఫాలో అవుతున్నాడు సుకుమార్. రైజ్‌, రూల్‌, రోర్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) స్ట్రాటజీని వర్కౌట్‌ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే వస్తుందని అంటున్నారు చూడాలి మరి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News