Allu Arjun : వైన్ షాపు వీడియోపై మొదటిసారి నోరు విప్పిన బన్నీ.. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట..!

Qubetvnews - November 15, 2024 / 11:59 AM IST

Allu Arjun : వైన్ షాపు వీడియోపై మొదటిసారి నోరు విప్పిన బన్నీ.. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట..!

Allu Arjun : బన్నీ గురించి ఓ మిస్టరీ వీడియో అందరికీ తెలిసిందే. ఆ వీడియో మీద చాలా రకాల రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పటి దాకా ఆ వీడియో గురించి ఎన్నడూ అల్లు అర్జున్ స్పందించలేదు. అయితే తాజాగా ఆయన బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకి వచ్చాడు. సీజన్ -4 లో ఆయన కూడా గెస్ట్ గా వచ్చాడు. గతంలో పుష్ప పార్టు-1 సమయంలో కూడా ఆయన ఈ షోకు వచ్చాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. అందుకే తనకు కలిసి వచ్చిన ఈ షోకు మరోసారి వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు అల్లు అర్జున్.

అయితే బాలయ్య ఆ వైన్ షాపు వీడియోను చూపించాడు. ఇందులో బన్నీ టీషర్టు మీద ఓ వైన్ షాపులోకి వెళ్లి ఏదో మందు బాటిల్ అడుగుతున్నట్టు ఉంది. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. అసలు అందులో ఏం జరిగింది అంటూ అడిగాడు. బన్నీ దానిపై స్పందిస్తూ.. నాకు విజయవాడలో ఓ ఫ్రెండ్ ఉన్నాడు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ కోసం గోవా వెళ్లాను. అప్పుడు వాడు నన్ను కలవడానికి అక్కడకు వస్తున్నట్టు ఫోన్ చేశాడు. వాడు ఓ మందు బాటిల్ పేరు చెప్పి అది కావాలన్నాడు. సరే ఫ్రెండ్ కదా తీసుకొద్దాం అని నేను వెళ్లాను.

ముందు మా కారు డ్రైవర్ ను షాపులోకి పంపించాను. కానీ అతనికి హిందీ సరిగ్గా రావట్లేదు. ఇబ్బంది పడుతున్నాడు. లేట్ అవుతుంది అని నేనే స్వయంగా వెళ్లి అడిగాను. అతను లేదనే సరికి తిరిగి వచ్చేశాను. అంతే. అది సీసీ టీవీలో రికార్డు అయింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ నేను తాగడం కోసమే వెళ్లానని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. నేను సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అస్సలు తాగను. సినిమా తప్ప వేరే ధ్యాస ఉండదు. అది నాతో ఉండేవారికి బాగా తెలుసు. నా ఫ్రెండ్ కోసమే వెళ్లాను అంటూ చెప్పి.. ఆ ఫ్రెండ్ ను కూడా షోకు పిలిచారు.

ఆ తర్వాత బాలయ్య నీకు పెళ్లికి ముందు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అంటూ అడిగాడు. దానికి బన్నీ స్పందిస్తూ.. ఎవరూ లేరని చెప్పాడు. నిజం చెప్పాలంటూ అడగ్గా.. బన్నీ స్పందిస్తూ.. నా భార్యకు అన్నీ చెప్పేశాను సార్.. కానీ పేర్లు, నెంబర్లు అవన్నీ ఇప్పుడెందుకు అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. దాంతో షోలో నవ్వులు పూశాయి. ఈ లెక్కన పెళ్లికి ముందు తనకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని బన్నీ చెప్పకనే చెప్పాడని కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News