Allu Arjun : అంతులేని విజయం.. అంతుచిక్కని ప్రతికూల పరిస్థితుల నడుమ అర్జునుడు..!
Qubetvnews - December 30, 2024 / 02:55 PM IST
Allu Arjun : అల్లు అర్జున్ ఇన్నేళ్లు దేని కోసం తపించాడో ఆ సక్సెస్ వచ్చింది. ఇరవై ఏండ్లుగా వేశాలు వేసుకుంటూ.. ఒక్కో పాత్రను కష్టపడి చేస్తూ ఏ స్టార్ డమ్ కోసం ఆరాటపడ్డాడో అది పుష్ప-2తో వచ్చేసింది. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వయసు వారి దాకా అందరూ పుష్పరాజ్ అనేస్తున్నారు. ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ జరిగితే అక్కడ కూడా పుష్ప మేనరిజాన్ని క్రికెటర్లు చేస్తున్నారు. అదే ఆస్ట్రేలియాలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ జరిగితే లోకల్ ఆసీస్ స్టార్లు కూడా పుష్పరాజ్ మేనరిజాన్ని అనుకరిస్తున్నారంటే.. ఇది ఏ రేంజ్ సక్సెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్నేళ్ల కల ఇప్పుడు తీరినా సరే అల్లు అర్జున్ సంతోషంగా లేడు.
ఇరవై ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషించే లోపే అనుకోని వివాదం ఆయన్ను వెంటాడుతోంది. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా జరిగినా సరే బన్నీ మాత్రం అందరికీ టార్గెట్ అయిపోయాడు. తన అభిమాని కుటుంబం ఆపదలో ఉందని.. చివరకు జైలు జీవితాన్ని కూడా సహించాడు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. అంతే తప్ప ఎవరిపై కోపం గానీ ఇంకోటి గానీ చూపించట్లేదు. అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏకంగా రెండు కోట్ల సాయం ప్రకటించారు. ఇంత చేస్తున్నా సరే అతన్ని మాత్రం పనిగట్టుకుని కొందరు టార్గెట్ చేస్తున్నారు.
ఎవరెన్ని మాటలు అన్నా.. ఎవరొచ్చి ఇంటి మీద దాడులు చేస్తున్నా సరే అల్లు అర్జున్ మాత్రం చట్టాన్ని గౌరవిస్తూ ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత సక్సెస్ వచ్చిన వెంటనే.. ఎన్నడూ చూడని వివాదం కూడా వెంటాడుతోంది. అయినా సరే సక్సెస్ ను పక్కన పెట్టేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి న్యాయ పరంగానే యుద్ధం చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ వివాదం నుంచి తాను నిర్దోషిగా బయట పడి ప్రజల మనసులు గెలవాలని ఆశిస్తున్నారు బన్నీ. అలా అని బాధిత కుటుంబాన్ని కూడా వదిలేయకుండా.. భవిష్యత్ లో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు.
ఏదో సాయం చేశాం అని వదిలేయకుండా.. ఆ కుటుంబానికి ఓ దారి చూపించి.. పిల్లల బాధ్యతను కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంత పెద్ద హీరో అయినా.. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా.. బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తున్నాడు బన్నీ. అంత పెద్ద సక్సెస్ ను కూడా పక్కన పెట్టేసి ఆ కుటుంబం కోసం నిలబడటంలోనే ఆయన చిత్తశుద్ధి ఏంటనేది తెలుస్తోంది.




