మహేశ్, ప్రభాస్, పవన్ గురించి బన్నీ ఏం చెప్పాడో తెలుసా.. ఫేవరెట్ హీరో అతనే..!

Qubetvnews - November 15, 2024 / 12:02 PM IST

మహేశ్, ప్రభాస్, పవన్ గురించి బన్నీ ఏం చెప్పాడో తెలుసా.. ఫేవరెట్ హీరో అతనే..!

పుష్ప-2 ప్రమోషన్స్ లో భాగంగా మొదటిగా అన్ స్టాపబుల్ షోకే వచ్చాడు బన్నీ. ఇందులో బాలయ్యతో చాలా విషయాలను పంచుకున్నాడు. బాలయ్య కూడా తెలుగు ఇండస్ట్రీలో హీరోల గురించి, డైరెక్టర్ల గురించి, తన ఫ్యామిలీ విషయాల గురించి అడిగాడు. అందులోనూ పవన్ కల్యాణ్ గురించి కూడా అడిగేశాడు. ఈ సీజన్-4లో బన్నీ ఎపిసోడ్ చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇక ఎపిసోడ్ మధ్యలో బన్నీని ప్రభాస్, మహేశ్, పవన్ కల్యాణ్‌ గురించి అడిగాడు. ఒక్కొక్కరి ఫొటో చూపిస్తూ వారి గురించి ప్రశ్నలు వేశాడు.

ముందుగా మహేశ్ ఫొటో చూపించాడు. బన్నీ మాట్లాడుతూ.. చాలా మంది మహేశ్ లో ఆయన అందం గురించే మాట్లాడుకుంటారు. ఆయనకు అందం దేవుడు ఇచ్చిన వరం. అయితే దానికంటే కూడా ఆయనలో నాకు కమ్ బ్యాక్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆయన నుంచి వచ్చే కమ్ బ్యాక్ చాలా బాగుంటుంది. ఆయన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకెళ్లారు అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ ఫొటోను చూపించాడు బాలయ్య. దాంతో బన్నీ ఏం చెప్తాడా అని అంతా ఆసక్తిగా చూశారు.

పవన్ కల్యాణ్‌ లో నాకు ధైర్యం అంటే చాలా ఇష్టం. ఆయన చాలా ధైర్యవంతుడు. ఏ విషయానికి కూడా భయపడడు. నేను సొసైటీలో చూసిన వ్యాపార వేత్తలు, పొలిటీషియన్స్ లో పవన్ కల్యాణ్‌ గారికి ఉన్న ధైర్యం ఎవరికీ లేదు. ముక్కుసూటిగా వెళ్లిపోతాడు అంటూ చెప్పాడు. మధ్యలో బాలయ్య కలగజేసుకుని తన దారిలో వెళ్లిపోతాడు అంటే.. అవును అంతే అంతే మీ లాగే అన్నాడు బన్నీ. ఆ తర్వాత ప్రభాస్ ఫొటోను చూపించాడు బాలయ్య. వెంటనే బన్నీ మాట్లాడుతూ.. ప్రభాస్ అప్పుడు, ఇప్పుడు ఆరడుగుల బంగారమే. నేను క్రిస్మస్ కు బాగా డెకరేట్ చేస్తానని తెలుసుకుని నాకు ఒక క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్ పంపించాడు.

నాకు చాలా సంతోషంగా అనిపించింది. అతనికి నేను ఒక చెట్టును గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్ లో పెంచుకుంటున్నాడు అంటూ తెలిపాడు. ఇక ఈ జనరేషన్ హీరోల్లో నీకు ఎవరు బాగా ఇష్టం అని అడిగితే.. నాకు విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నల గడ్డ, నవీన్ పోలిశెట్టి అంటే చాలా ఇష్టం అన్నాడు. ఒకరిపేరు చెప్పాలని బాలయ్య అడగ్గా.. సిద్ధు జొన్నలగడ్డ పేర చెప్పాడు బన్నీ. అలాగే రణ్ బీర్ కపూర్, సుకుమార్, త్రివిక్రమ్, దిల్ రాజు, గుణశేఖర్ గురించి కూడా చెప్పుకొచ్చాడు బన్నీ.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News