Congress Party : కాంగ్రెస్ గూటికి మహేందర్ రెడ్డి దంపతులు.. బొంతు రామ్మోహన్ కూడా..!
Qubetvnews - February 17, 2024 / 07:01 AM IST
Congress Party :
బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోకి వలసలు వెళ్లితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద పల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. మొన్ననే మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడే వారి చేరిక ఖరారు అయిపోయింది.
రేపు అంటే శుక్రవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరబోతున్నారు. ఈయనతో పాటు మరికొంత మంది కీలక నేతలు కూడా చేరబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్నారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రీసెంట్ గానే బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు.
వీరందరూ బీఆర్ఎస్ లో అసంతృప్తిగానే ఉన్నారు. మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి టికెట్లు రాక అసహనంలో ఉన్నారు. బొంతు రామ్మోహన్ కూడా ఉప్పల్ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. కాబట్టి వీరు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారని తెలుస్తోంది.





