KTR : ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం జగనే- కేటీఆర్

Qubetvnews - April 28, 2024 / 10:08 AM IST

KTR : ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం జగనే- కేటీఆర్

KTR :

గెలిచేదెవరు? ప్రజా క్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసెదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్ గా ఇప్పుడీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాల్ని ఊహిస్తున్నాయి.

అయితే ఏపీ పాలిటిక్స్ పై, ఎలక్షన్ రిజల్ట్స్ పై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ ఏపీ కొచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి తమ పార్టీనే ఆంధ్రాలోనే అధికారాన్ని దక్కించుకోనుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై మాట్లాడారు. ఏపీలో ఎవరు అధికారంలోకొస్తారంటూ ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్ వ్యూలో పాల్గొన్న కేసీఆర్ ని యాంకర్ అడగ్గా.. మాకున్న సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే సీఎం అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు గెలుపుపై ధీమాని మరింత పెంచాయి.

మరోవైపు తాజాగా కేటీఆర్ కూడా ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఆవిస్కరించారు కేటీఆర్. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ, వచ్చే ఎన్నికల్లో బీఆరెస్సే విజయం సాధిస్తుందన్నారు.

ఏపీ రాజీకీయల గురించి కూడా చర్చకొచ్చిన నేపథ్యంలో జగనే మళ్లీ సీఎం అయే అవకాశాలున్నాయనీ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరు అధికారంలోకొచ్చినా మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ కూడా కామెంట్ చేశారు కేటీఆర్. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓపెన్ గా వైసీపీకే విజయాకాశాలున్నాయని క్లియర్ కట్ గా చెప్పడంతో వీళ్ల మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలన్ని ఉత్సుకత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ పెరిగింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News