Eagle Movie Review : ఈగల్ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?
Qubetvnews - February 17, 2024 / 08:37 AM IST
Eagle Movie Review :
మాస్ మహారాజ రవితేజ ఈ నడుమ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. ఒక స్టార్ హీరో ఇంత ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేయడం అంటే అది కేవలం రవితేజకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఆయన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈగల్ సినిమాను చేస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి మూవీ ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
ఇది సస్పెన్స్ తా సాగే సినిమా. రవితేజ ఓ అడవిలో నివసిస్తుంటాడు. ఆయన చుట్టూ జరిగే అన్యాయాల నుంచి ప్రజలను కాపాడుతుంటాడు. తన అనుకునే వాళ్లను కాపాడడమే అతని పని. అయితే రవితేజను పోలీసులు అడవి నుంచి బయటకు తీసుకురావాలని చాలా సరకాల స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు. ఒకవేళ రవితేజ అడవి నుంచి బయటకు వస్తే అతన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నది పోలీసుల ఆలోచన. మరి పోలీసులు రవితేజను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.. అసలు రవితేజ గత చరిత్ర ఏంటి అనే సస్పెన్స్ కొలిపే సీన్లను తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాల్సిందే.
విశ్లేషణ..
ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ బాగానే ఉంది. పైగా దాన్ని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉంది. చాలా సీన్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా తెరకెక్కించాడు కార్తీక్. ఆయన కొన్ని సీన్ల కోసం రాసుకున్న డైలాగులు గానీ.. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం గానీ బాగానే ఆకట్టుకుంది. ఇలాంటి కథకు రవితేజ సెట్ అవుతాడని భావించడం ఇంకో మిరాకిల్. ఇలాంటి కథ దొరికితే రవితేజ లీనమైపోతాడని తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన నటనతో అలాంటి పనే చేశాడు. ఈ సినిమాను చాలా వరకు యాక్షన్ సీన్లతో, ఎలివేషన్ సీన్లతో ముందుకు తీసుకెళ్లాడు కార్తీక్. అయితే కథలో అక్కడక్కడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా రవితేజ తన నటనతో అవి ప్రేక్షకులకు గుర్తుకు రాకుండా చేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఇస్తూ తెరకెక్కించాడు దర్శకుడు. ఇక విజువల్స్ కూడా నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి.

Eagle Movie Review
నటీనటుల పనితీరు…
రవితేజకు బలమైన పాత్ర పడితే ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశాడు. ఈ సినిమాను తన భుజాలపై మోశాడు రవితేజ. ఎందుకంటే కథలో అక్కడక్కడా పొరపాట్లు ఉన్నా సరే తన నటనతో వాటన్నింటినీ మెప్పించాడు. చాలా సీన్లలో ఏడిపించేశాడు.. అంతే కాకుండా కామెడీ సీన్లు కూడా బాగానే చేశాడు. ఇక మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్లలో రవితేజ నటన నెక్ట్స్ లెవల్ లో ఉందనే చెప్పుకోవాలి. చాలా వరకు రవితేజ నటనే మనకు ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయనతో పాటు నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే మెప్పించింది. నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ లాంటి నటీనటులు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
టెక్నికల్ పర్ఫార్మెన్స్…
టెక్నికల్ విషయాలకు వస్తే.. కార్తీక్ ఘట్టమనేని ఇంతకు ముందు సినిమాటోగ్రాఫర్ కాబట్టి.. కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది బాగానే పసిగట్టాడు. అంతే కాకుండా కథకు తగ్గట్టు ప్రజెంటేషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. పైగా విజువల్స్ అయితే మరో లెవల్ లో ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జంద్ ఎలివేషన్ సీన్లను తన బీజీఎంతో దుమ్ము లేపాడు. ఆయన ఇచ్చిన బీజీఎం సీన్లను మరో లెవల్ లో ఉంచింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

Eagle Movie Review
ప్లస్ పాయింట్స్…
రవితేజ యాక్టింగ్
డైరెక్షన్
యాక్షన్ సీక్వెన్సెస్
మైనస్ పాయింట్స్…
స్టోరీ లో కొన్ని లూప్ హోల్స్
అక్కడక్కడా రొటీన్ సీన్లు





