BRS : కొత్త తరం నాయకులు.. కొత్త నినాదం ఎత్తుకుంటున్న బీఆర్ ఎస్..!

Qubetvnews - March 30, 2024 / 09:33 AM IST

BRS : కొత్త తరం నాయకులు.. కొత్త నినాదం ఎత్తుకుంటున్న బీఆర్ ఎస్..!

BRS : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా పార్టీ చాలా కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆపార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంది. దాంతో పాటు ఇటు వరుసగా పార్టీని వీడిపోతున్నారు నేతలు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చిన కీలక నేతలు అందరూ ఇప్పుడు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు కేటాయించినా సరే వారు వద్దని వెళ్లిపోతున్నారు.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడిపోతున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న చాలా మంది కీలక నేతలు ఇప్పుడు ఇలా వెళ్లిపోవడం బీఆర్ ఎస్ ను ఆందోళనలో పడేస్తోంది. ఈ వరుస షాక్ ల నుంచి బీఆర్ ఎస్ ఇంకా కోలుకోవట్లేదు. అయితే తమ తప్పు ఎక్కడుందనేది కేసీఆర్ ఫ్యామిలీ అంచనా వేస్తోంది. సొంతంగా నాయకులను తయారు చేసుకోకపోవడంతో పాటు ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడం వల్లే ఇప్పుడు ఇలా జరిగిందని కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకే ఇప్పుడు కొత్త నినాదాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్తతరం నాయకులను తయారు చేస్తామని.. వెళ్లిపోయే వారిని వెళ్లిపోనివ్వండి అంటూ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇప్పుడు పార్టీలో సొంతంగా నాయకులను తయారు చేసుకుని వారితో పార్టీని పునర్నిర్మిస్తామని అంటున్నారు కేటీఆర్. అంటే ఇది తప్పును సరిదిద్దుకున్నట్టు అంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటి వరకు ఇలాంటి ఎత్తుగడలు వేయలేదు. ఎంత సేపు పార్టీలోకి వస్తున్న వారికే ప్రధాన అవకావాలు అప్పగించారు.

కానీ ఇప్పుడు పార్టీ కోసంనిలబడ్డ పాత నేతలను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు పార్టీ కూడా ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి.. నాయకులకు సొంతంగా ఖర్చుచేయచ్చని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనక కేసీఆర్ వ్యూహం కూడా ఉందని అంటున్నారు.

సొంతంగా నాయకులను తయారు చేసుకుంటే వారు పార్టీ లైన్ ను దాటి పోరని ప్లాన్ వేస్తున్నారు కేటీఆర్. ఇలా అరువుకు తెచ్చుకున్న నేతలు తిరిగి వెళ్లిపోతారని ఆయనకు ఇప్పుడు అర్థం అయింది. అందుకేఇప్పుడు సొంతంగా పార్టీ నేతలను తయారు చేసుకుంటామని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News