Congress : హరీశ్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ కౌంటర్.. రేవంత్ కు సపోర్టుగా..!

Qubetvnews - July 30, 2024 / 08:11 PM IST

Congress : హరీశ్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ కౌంటర్.. రేవంత్ కు సపోర్టుగా..!

Congress : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పదే పదే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను విద్యుత్ కమిషన్ ముందుకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ రద్దు చేయమని అడగమేంటి.. మీరు సత్యహరిశ్చంద్రులు అయితే.. మీ నిజాయితీని నిరూపించుకోవాలంటూ చెబుతున్నారు. అయితే ఇదే విషయం మీద పదే పదే కేటీఆర్, హరీష్‌ రావు స్పందిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీదనే ఎక్కువగా చర్చలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని.. కాబట్టి వాటిపై విచారించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంది కాంగ్రెస్ పార్టీ.

కానీ అసెంబ్లీలో దీనిపై ప్రశ్నలు వచ్చినప్పుడల్లా కేటీఆర్, హరీశ్ రావు స్పందిస్తున్నారు. దీనిపై సమాధానాలు చెప్పేందుకు తాము సరిపోతామని.. కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని వారు చెబతున్నారు. అయితే దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా బలంగానే సమాధానాలు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మేమిద్దరమే సరిపోతామని కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఎందుకు.. ఆయన ఇక్కడకు రాకపోతే ఆయనకు ఆ పదవిలో ఉంచడం ఎందుకు అని ప్రశ్నించారు.

దాంతో సభలో మొత్తం కాంగ్రెస్ ప్రశ్నలే హైలెట్ అయిపోయాయి. వాస్తవానికి కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్న మాటలు, ఇస్తున్న సమాధానాలు కూడా కేసీఆర్ రాడు అన్న స్టైల్ లోనే ఉంటున్నాయి తప్ప.. కేసీఆర్ ఎందుకు రాడు అనే విషయాన్ని మాత్రం వారు బలంగా వివరించలేకపోతున్నారు. అదే వారిని ఇరకాటంలో పెడుతోంది. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో దానికి మంచి వివరణ ఇస్తే బాగుండేదేమో.. కానీ కేసీఆర్ అవసరం లేదు అనే విధంగా మాట్లాడితే మాత్రం అది బీఆర్ ఎస్ పార్టీకే నష్టం అనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు.

దీన్నే అదునుగా భావించి కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతోంది. దాంతో బీఆర్ ఎస్ నేతలు ఇతర సమస్యలపై విమర్శలు చేసినా అవి హైలెట్ కాకుండా ఇవే హైలెట్ అవుతున్నాయి. కాబట్టి ముందు కేసీఆర్ బలమైన కారణాలు చెప్పకుండా.. కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా.. అవి నిలవట్లేదని చెప్పుకోవాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News