KTR : కేటీఆర్ కు గట్టి ఛాలెంజ్.. నెగ్గుతాడా..?

Qubetvnews - March 24, 2024 / 09:39 AM IST

KTR : కేటీఆర్ కు గట్టి ఛాలెంజ్.. నెగ్గుతాడా..?

KTR : తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా కేటీఆర్ గురించే చెబుతారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి కేటీఆర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ ను మించేలా అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తుంటారు. మాటలో గానీ.. రాజకీయంలో గానీ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గానీ.. సబ్జెక్ట్ లో గానీ కేసీఆర్ ను ఏ మాత్రం తీసిపోరు కేటీఆర్. అందుకే కేటీఆర్ కు బీఆర్ ఎస్ లో తెలంగాణలో మంచి ఇమేజ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే గత పదేండ్లు తిరుగులేని పవర్ తో దూసుకుపోయారు కేటీఆర్.

కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయింది. పైగా కేసీఆర్ కాలికి సర్జరీ చేయించుకుని ఇంటికే పరిమితం అయిపోయారు. దానికి తోడు ఇప్పుడు కవితను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఇటు బీఆర్ ఎస్ లోని కీలక నేతలు, కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ మీదనే భారం మోపారు కేసీఆర్. అటు కవితను విడిపించుకు రావడంలో ఇప్పుడు కేటీఆర్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేటీఆర్.. దేశంలోనే టాప్ మోస్ట్ లాయర్లతో మాట్లాడుతున్నారు. ఎలాగైనా తన చెల్లెలిని విడిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

లిక్కర్ కేసులో కవిత పాత్ర.. ఆమెను బయటకు తీసుకురావడానికి ఉన్న అవకాశాలు ఇలా అన్నింటిని తెలుసుకుంటున్నారు. ఎలాగైనా చెల్లెలును తీసుకుని ఇంటికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కవితను ఇప్పట్లో వదిలే ప్రసక్తే కనిపించట్లేదు. దాంతో ఇప్పుడు కేటీఆర్ కు కత్తి మీద సాములా మారింది కవిత ఇష్యూ. అటు ఢిల్లీలో కవిత గురించి ప్రయత్నాలు చేస్తూనే.. ఇటు తెలంగాణలో కీలక లీడర్లను సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ వీడిపోకుండా చూసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మాత్రం ఆగట్లేదు.

దాంతో ఇప్పుడు కేటీఆర్ కు ఈ రెండు పెద్ద ఛాలెంజ్ లా మారిపోయాయి. ఈ రెండింటినీ ఎలా ఎదుర్కుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోనే ఉండటంతో ఇప్పుడు బాధ్యత మొత్తం కేటీఆర్ నెత్తిన పడింది. ఆయనే ఇప్పుడు కవితను బయటకు తీసుకురావాలి. ఇటు పార్టీని కాపాడుకోవాలి.

అంతే కాకుండా కాంగ్రెస్, బీజేపీలకు గట్టి సమాధానాలు కూడా ఇవ్వాలి. మొత్తంగా ఇప్పుడు కేటీఆర్ కు గడ్డు పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎటు చూసుకున్నా కేటీఆర్ కు ఇప్పుడు అనుకూల పరిస్థితులు అయితే లేవు. మరి కేటీఆర్ ఈ బాధ్యతలను ఎలా నెరవేరుస్తాడనేది చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News