Brs Mlas : కాంగ్రెస్ గూటిలో ఇమడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతోంది..?

Qubetvnews - July 30, 2024 / 08:13 PM IST

Brs Mlas : కాంగ్రెస్ గూటిలో ఇమడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతోంది..?

Brs Mlas : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పది మందిఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. ఇంత మందిని లాగేసుకుంటారని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. కానీ లాగేశారు. అయితే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది హామీల మీదనే వెళ్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే వీరు స్వయంగా వస్తామని చెప్పకముందే కాంగ్రెస్ లోని చేరికల టీమ్ వీరినిసంప్రదించి మరీ హామీలు ఇస్తోందంట. కొందరికి మంత్రి పదవులు, మరికొందరికి ఇతర పదవులతో పాటు అనేక రకాల హామీల మీదనే వారిని చేర్చుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ఇలా వివిధరకాల హామీల మీద వస్తున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ లో ఇమడట్లేదని అంటున్నారు. ఎందుకంటే సదరు ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ లీడర్లు వారిని పార్టీలో ఇమడనీయట్లేదంట. వారిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఈ నేతలను పార్టీలో అస్సలు కుదురుకోనివ్వట్లేదని తెలుస్తోంది. పెత్తనం అంతా వారిదే కాదడంతో.. బీఆర్ ఎస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లాగా అయిపోతున్నారంట. దాంతో ఇప్పటికిప్పుడు తాము పార్టీ మారినా పెద్దగా ప్రయోజనం లేదని.. రాబోయే ఎన్నికల్లో కూడా అసలు టికెట్ వస్తుందో రాదో అనే భయం వారిలో మొదలైంది.

అందుకే చాలా మంది ఇప్పుడు అభద్రతా భావంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే గద్వాల ఎమ్మెల్యే అయిన బండ్ల కృష్ణ మోహన్ మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కూడా.. వెంటనే తిరిగి యూ టర్న్ తీసుకున్నారు. నెల రోజులకే తాను బీఆర్ ఎస్ లోనే ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు మిగతా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు వణుకు పుట్టించింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ లో చేరుదామని అనుకుంటున్న మిగతా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు భయం పుట్టించింది. ఇక తాము కాంగ్రెస్ లోకి వెళ్తే ఇబ్బందులు తప్పవని వారికి అర్థమైపోయింది.

దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది. తమకు తాముగా వెళ్లినా.. హామీల మీద వెళ్లినా కాంగ్రెస్ లో రేపు పొద్దున ఎవరు ఎలాంటి పొజీషన్ లో ఉంటారో తెలియదు కాబట్టి.. అక్కడ ఒకరి పెత్తనం కాదు కాబట్టి.. వెళ్లి ఇబ్బందులు పడితే లాభం లేదని వారు భావిస్తున్నారంట. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలసలు ఆగినట్టు తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News