BRS : సిట్టింగ్ ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ ఫోకస్.. పార్టీ మారిన వారిపై రివేంజ్..!

Qubetvnews - April 12, 2024 / 09:02 AM IST

BRS : సిట్టింగ్ ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ ఫోకస్.. పార్టీ మారిన వారిపై రివేంజ్..!

BRS : ఒకప్పుడు బీఆర్ ఎస్ లోకి ఇతర పార్టీల నుంచినేతలు క్యూ కట్టేవారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకప్పుడు బీఆర్ ఎస్ టికెట్ దొరికితే చాలు దానిపై ఎవరైనా ఈజీగా గెలుస్తారు అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానికి తోడు వరుసగా పార్టీ నేతలపై వస్తున్న కొన్ని ఆరోపణలు ఇంకా ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. అటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంతో పాటు ఇటు పార్టీ నేతలపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి.

వాటితో పాటు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముదురుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, టికెట్ రాని ఆశావహులు మాత్రమే వెళ్లారు. ఇప్పుడు వారికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గానే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు లాంటి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరింత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే కొందరు బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని కేసీఆర్ ఫ్యామిలీకి రిపోర్ట్ అందింది. దాంతో ఇప్పుడు కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారంట. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయారు కాబట్టి.. వారి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసే విధంగా లేదంటే వారిపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్ కు ఫిర్యాదులు చేయించాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని అంటున్నారు.

పార్టీ మారిపై వారిపై చర్యలు తీసుకుంటే.. అప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు భయంతో పార్టీని వీడకుండా ఉంటారని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. దాంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఉంటారో.. వారికి భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు.

రాబోయేది బీఆర్ ఎస్ ప్రభుత్వమే అని.. కాబట్టి కచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఇలా పార్టీని వీడి వెళ్లిపోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు మాజీ సీఎం కేసీఆర్. చూడాలి మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News