Kcr : ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ..?

Qubetvnews - June 25, 2024 / 08:11 PM IST

Kcr : ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ..?

Kcr : బీఆర్ ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ పెద్దగా పుంజుకోవ్లేదు. ఇక మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తుందేమో అని ఆశ పడితే అది కూడా జరగలేదు. ఒక్క సీటు కూడా దక్కలేదు బీఆర్ ఎస్ పార్టీకి. దాంతో పార్టీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ ఫిరాయింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా పార్టీని వీడారు. ఇక వారితో పాటు పార్టీలో సీనియర్ లీడర్ అయిన పోచారం కూడా అదే బాట పట్టారు.

బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ ఎస్ లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అత్యంత కీలక నేతగా ఉన్న ఆయన కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. దాంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు, కీలక మైన నేతలు పార్టీని వీడకుండా ఉంటేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే కండువా మార్చిన నేతలపై చర్యలకు సిద్ధమవుతుండటంతో పాటు ఆయా ఎమ్మెల్యేలకు నిరసన తగిలేలా ఆందోళనలకు సిద్ధం అవుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గతంలో ఫిరాయింపు దారులపై చేసిన కామెంట్లతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కాబట్టి ఇప్పుడు మీ పార్టీకి ఒకరూల్.. వేరే పార్టీలకు ఒక రూల్ ఎలా వర్తిస్తుంది అంటూ దానిపై నిలదీసేందుకు రెడీ అవుతున్నారు గులాబీ బాస్. అటు కాంగ్రెస్ ను కట్టడి చేయడంతో పాటు.. ఇటు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను కాపాడుకునే పనిలో పడ్డారు గులాబీ బాస్. ఇందుకోసం చాలా కొత్త ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో పాటు ఆ తర్వాత కింది స్థాయి నేతలతో ఫోన్లు మాట్లాడుతున్నారు.

పార్టీని వీడొద్దని.. ఐదేండ్లు కండ్లు మూసుకుంటే గడిచిపోతాయి కాబట్టి.. తర్వాత మనమే అధికారంలో ఉంటామని చెబుతున్నారు. ఇందుకోసం ఇన్ని విధాలుగా హామీలు ఇస్తున్నారు కేసీఆర్. ఇందుకోసం అన్ని విధాలుగా కేటీఆర్ తో పాటు హరీశ్ రావుకు ఆదేశాలు ఇస్తుననారు.

ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా సరే స్వయంగా వెళ్లి పరిష్కరించాలంటూ చెబుతున్నారు కేసీఆర్. చూడాలి మరి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ కేడర్ ను కాపాడుతాయా లేదా అనేది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News