Kcr : కేసీఆర్ రాజకీయ చతురత ఏమైంది.. ఎమ్మెల్యేలను కాపాడుకోలేరా..?

Qubetvnews - June 28, 2024 / 08:41 PM IST

Kcr : కేసీఆర్ రాజకీయ చతురత ఏమైంది.. ఎమ్మెల్యేలను కాపాడుకోలేరా..?

Kcr : కేసీఆర్ కు తెలిసినంత రాజకీయం ఇంకెవరికీ తెలియదని అంటారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే కేసీఆర్ సొంతంగా ఒక పార్టీని పెట్టి.. ప్రజలందరినీ ఏకం చేసి సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అంతే కాకుండా కేసీఆర్ తన పార్టీని బలంగా మార్చుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఉద్యమ పార్టీ స్థాయి నుంచి రాజకీయ పార్టీగా మార్చుకుని పదేండ్లు సీఎంగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన రాజకీయాల్లో ఎంతో చతురత చూపించారు. ప్రతిపక్షాలను తన రాజకీయ మేథస్సుతో బలహీన పర్చారు. కానీ ఎంతటి బలవంతుడినైనా ఓడించే శక్తి కాలానికే ఉంది.

అలాగే కేసీఆర్ ను మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓడించారు. ఇక్కడి వరకు ఒక ఎత్తు అనుకుంటే.. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడమే కేసీఆర్ కు అతిపెద్ద సవాల్ గా మారిపోయింది. ఓడిపోయిన వెంటనే చాలా మంది ఎంపీలు పార్టీని వీడారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ వ్యూహం మార్చారు. ఎంపీ ఎన్నిలక్లో ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తే మళ్లీ పుంజుకోవచ్చని భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క సీటు కూడా రాలేదు. దానికి తోడు ఇప్పుడు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు. రాజకీయంగా ఇది కేసీఆర్ కు చాలా గడ్డు కాలం.

కేసీఆర్ లాంటి అపర చాణక్యుడికి పార్టీ మీద పట్టు లేదని మనం అనలేం. కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపలేకపోవడం అంటే అది కేసీఆర్ కు రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుంది. ఎందుకంటే ఒక పార్టీని ఇరవై ఏండ్లుగా నడిపిస్తున్న వ్యక్తికి పార్టీ నేతలతో పూర్తిగా సంబంధాలు ఉంటాయి. ఆయన ఒక మాట చెబితే పార్టీ నేతలు అందరూ అక్కడే ఆగిపోవాలి. కానీ ఇప్పుడు కేసీఆర్ కు ఆ పట్టు లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే. అలా అని కేసీఆర్ ఒక్కడే ఉన్నాడా అంటే అదీ కాదు. ఆయన తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాంటి వారంతా పార్టీని ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చారు.

మరి వారందరూ ఉన్నా కూడా పార్టీలో నుంచి నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఆపలేకపోవడం అంటే నిజంగా వైఫల్యమే. గతంలో కేటీఆర్ హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా బీఆర్ ఎస్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు బీఆర్ ఎస్ నేతలు కూడా కేటీఆర్ కు చివరగా చెప్పేసి మరీ వెళ్తున్నారంట. అయినా సరే ఆపలేకపోతున్నారు కేసీఆర్, కేటీఆర్.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News