Kcr : ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ సరిదిద్దులు.. కొత్త వారికే అవకాశాలు…?
Qubetvnews - March 13, 2024 / 09:35 AM IST
Kcr : కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మరోసారి చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాస్తవానికి మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా సరే చేతులారా పోగొట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇవ్వడమే కొంప ముంచిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సరే వారికే టికెట్లు ఇవ్వడం వల్లనే ప్రజల్లో ఓటమి చవి చూశామని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించాలని లక్షయంగా పెట్టుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సీట్లను సాధిస్తేనే తమ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కేసీఆర్ అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవేళ తక్కువ సీట్లు సాధిస్తే మాత్రం బీఆర్ ఎస్ మీద వ్యతిరేకత ఉంది అనే ఇంటిమేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి టికెట్లు ఇవ్వకుండా గెలుస్తారు అనే నమ్మకం ఉన్న వారికే టికెట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎంపీ నియోజకవర్గాల్లో కొన్ని సర్వేలు కూడా చేయించుకున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా ఎవరికి అయితే వ్యతిరేకత ఉందో వారిని పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నారు.
అంతే కాకుండా కొత్త వారికి మాత్రమే అవకాశాలు ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే కేసీఆర్ ఈ సారి ఎంపీ ఎన్నికల్లో కొత్త వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుండి మాలోతు కవిత, కరీంనగర్ నుండి బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. కాగా ఇప్పుడు మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
అంతే కాకుండా , జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్, మల్కాజిగిరి నుండి శంభీపూర్ రాజు, చేవేళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును మొదట్లో ప్రకటించారు. కానీ ఆయన మరోసారి పోటీకి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో జ్ఞానేశ్వర్ ను ప్రకటించారు.
అటు మల్కాజిగిరి నుంచి కూడా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి రాజకీయ సమీకరణాల దృష్ట్యా శంభీపూర్ రాజు పేరును ప్రకటించారు. ఇలా ఈ సారి కొత్త వారికే అవకాశాలు ఇచ్చి ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.




