Revanth Reddy : బీఆర్ ఎస్ ను చావుదెబ్బ కొట్టబోతున్న రేవంత్..?

Qubetvnews - March 22, 2024 / 09:41 AM IST

Revanth Reddy : బీఆర్ ఎస్ ను చావుదెబ్బ కొట్టబోతున్న రేవంత్..?

Revanth Reddy : బీఆర్ ఎస్ విషయంలో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల ఉన్న గ్రాఫ్‌ ను పూర్తిగా పడగొట్టేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరం మీద చాలా రకాలుగా ప్రచారాలు నిర్వహించారు. కాళేశ్వరంలో అవినీతి అంటూ.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశారు. అటు అసెంబ్లీలో దానిపై చర్చ పెట్టడం, ఆ తర్వాత మేడిగడ్డ పరిశీలన.. ఆ తర్వాత అసెంబ్లీలో పిల్లర్లు కుంగిపోవడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలా అన్నింటి ద్వారా బీఆర్ ఎస్ అవినీతి చేసిందంటూ ప్రజల్లో చర్చ జరిగేలా తెరలేపారు.

దాంతో అప్పటి నుంచి బీఆర్ ఎస్ మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత రావడం మొదలైంది. అయితే ఇలా బీఆర్ ఎస్ కు ఉన్న గ్రాఫ్‌ ను పడగొట్టడానికి రేవంత్ వేసుకున్న అసలు ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. ఒక పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకువస్తే.. ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అంతే కాకుండా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నా సరే అప్పుడు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత, విమర్శలు రావనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇందులో భాగంగానే ఆయన బీఆర్ ఎస్ మీద ముందు ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.

కాగా ఇప్పుడు త్వరలోనే బీఆర్ ఎస్ నుంచి భారీ ఎత్తున ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రెడీ అయిపోయారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులను కాంగ్రెస్ లో చేర్చుకుని వారికి టికెట్లు, ఇతర పదవులు ఇస్తున్నారు. కేసీఆర్ కూడా గత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సమయంలో భారీగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయినట్టు తెలుస్తోది. త్వరలోనే బీఆర్ ఎస్ నుంచి 26మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం వారంతా కారు దిగిపోవడానికి లగేజ్ సర్ధుకుని రెడీగా ఉన్నారని అంటున్నారు.

ప్రస్తుతం బీఆర్ ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తే అది కచ్చితంగా బీఆర్ ఎస్ కు చావుదెబ్బే అని చెప్పుకోవాలి. పైగా లోక్ సభ ఎన్నికల ముంగిట జరిగితే అది మరింత భారీ దెబ్బ అని.. ఫలితంగా బీఆరెస్స్ ఇప్పట్లో తేరుకునే అవకాశం లేదని అంటున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News