Kcr : ఆ మిస్టేక్ మళ్లీ రిపీట్ చేయని కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కొత్త పంథా..!
Qubetvnews - March 9, 2024 / 09:43 AM IST
Kcr : కేసీఆర్ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఒక సారి తనకు ఎదురైన అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవడంలో దిట్ట. అసలు అలా ఎందుకు జరిగింది, ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది అనే విషయాలను ఆయన కూలంకుషంగా పరిశీలించి మరీ తర్వాత మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన దెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు అధికారాన్ని దూరం చేశాయి. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సరే మార్చకపోవడం వల్లనే ఎదురుదెబ్బలు తగిలాయని చెబుతున్నారు కేసీఆర్.
చివరి నిముషంలో మార్చడానికి వీలు కాలేదని.. అదే తనకు ఎదురు దెబ్బ తగిలే విధంగా చేసిందని చెబుతున్నారు కేసీఆర్. అందుకే ఈ సారి ఎంపీ ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగకుండా చూసేందుకు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అసలు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరి మీద వ్యతిరేకత ఉంది అనే విషయాలను కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురికి టికెట్లు కేటాయించిన కేసీఆర్.. మిగతా నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారంట. ఈ సారి ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా.. ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్.
అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ నేతల్లో ఎంపీ అభ్యర్థిపై వ్యతిరేకత ఉందా లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. బీఆర్ ఎస్ కేడర్ మొన్నటి ఎన్నికల్లో వద్దన్న వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి దెబ్బ తిన్నామని కేసీఆర్ ఇప్పుడు గుర్తుంచుకున్నారు. అందుకే ఈ సారి బీఆర్ ఎస్ కార్యకర్తల్లో ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తికే టికెట్ కేటాయించాలని డిసైడ్ అయ్యారు. దాంతో పాటు అటు ప్రజల్లో కూడా పట్టు ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని సీక్రెట్ సర్వేలు కూడా చేయించుకుంటున్నారంట కేసీఆర్. ఈ సారి ఆర్థికంగా బలం ఉన్న వారికి కాకుండా ప్రజల్లో బలం ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో తక్కువ సీట్లకు పరిమితం కావడం అనేది బీఆర్ ఎస్ గ్రాఫ్ ను తగ్గిస్తోంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ అన్ని విధాలుగా ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే అది కచ్చితంగా పార్టీ గ్రాఫ్ ను పెంచుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
సాధారణంగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ఉన్నంత ప్రాముఖ్యత బీఆర్ ఎస్ కు ఉండదని కేసీఆర్ కు తెలుసు. కానీ ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం కేసీఆర్ కు తక్షణ అవసరం. అందుకే ఆయన ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది.




