Kcr new plan about bjp and congress : కేసీఆర్ కొత్త వ్యూహం.. కాంగ్రెస్ ను సైడ్ చేస్తూ.. బీజేపీని లైన్ లోకి తెస్తున్నారా..?
Qubetvnews - March 5, 2024 / 09:15 AM IST
Kcr new plan about bjp and congress : కేసీఆర్ అంటే రాజకీయాల్లో తలపండిన నేత. ఎప్పుడు ఎవరిని హైప్ చేయాలో.. ఎవరిని తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో గత పదేండ్లు ఆయన ట్రెండ్ చేసి రాజకీయాలను నడిపించారు. అప్పట్లో కాంగ్రెస్ ను తగ్గించడం కోసం కేసీఆర్ బీజేపీని హైలెట్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అదంతా కేసీఆర్ రాజకీయ చాణక్యం అని అంటుంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఎందుకంటే మన ప్రత్యర్థి మనకంటే బలంగా తయారవుతుంటే.. పక్కనే ఉన్న బలహీనుడిని బలవంతుడు అంటూ ప్రచారం చేయాలి. అప్పుడు జనాల దృష్టి ఆ బలహీనుడి మీదకు వెళ్తుంది.
అప్పుడు ఆ బలహీనుడిని దెబ్బ కొడితే అందరికంటే మనమే బలవంతులం అవుతామన్నది కేసీఆర్ మైండ్ గేమ్. ఆ గేమ్ ను గత పదేండ్లు బాగానే ప్లే చేసిన ఆయనకు మొన్నటి ఎన్నికల్లో మాత్రం అనుకోకుండా దెబ్బ పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు కేసీఆర్ ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్, బీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే టాక్ తెరమీదకు వచ్చింది. దాంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లను సాధించాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఆయన మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న కరీంనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించదని తెలిపారు కేసీఆర్. ఆయన చేసిన కామెంట్లలో లోతైన అర్థం ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను సైడ్ చేయడం కోసం మళ్లీ బీజేపీని హైలెట్ చేసే పనిలో పడ్డారని అంటున్నారు. వాస్తవానికి ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఏ ఎన్నికల్లో అయినా ఎక్కువ విజాయావకాశాలు ఉంటాయి.
ఆ విషయాలు కేసీఆర్ కు కూడ ఆ బాగానే తెలుసు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ను సైడ్ చేసేసి బీజేపీని హైలెట్ చేసే పనిలో పడ్డారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండొద్దని భావించారు కేసీఆర్. అందుకే కాంగ్రెస్ ను సైడ్ చేస్తే ఆటోమేటిక్ గా బీజేపీ, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ ఉందని ప్రజలు భావిస్తారు.
బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి.. బీఆర్ ఎస్ ఎంపీలను గెలిపించుకోవచ్చు అన్నది కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇలా తన మైండ్ గేమ్ ను స్టార్ట్ చేశారు కేసీఆర్. ఇలాంటి గేమ్ లు ఆడటం కేసీఆర్ కు కొత్త కాదు. కానీ ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయనేది ఎంపీ ఎన్నికల్లో చూడాలి.


