Patnam Sunitha Mahender Reddy : ప్రజా న్యాయం, ధర్మ పోరాటం, ప్రజా పాలన లక్ష్యం : సునీతా మహేందర్‌ రెడ్డి

Qubetvnews - April 30, 2024 / 09:04 AM IST

Patnam Sunitha Mahender Reddy : ప్రజా న్యాయం, ధర్మ పోరాటం, ప్రజా పాలన లక్ష్యం : సునీతా మహేందర్‌ రెడ్డి

Patnam Sunitha Mahender Reddy  :

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్‌ రెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. నిన్న ఎల్బీ నగర్ లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని సునీతమ్మను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. రేవంత్‌ రెడ్డి ప్రచారం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. ఇదే జోష్ తో ముందుకు వెళ్లి సునీతమ్మను గెలిపించుకుంటాం అంటూ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సిట్టింగ్‌ స్థానం, పైగా రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం అవ్వడంతో తమకు చాలా కీలకం అంటూ మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని నాయకులు మరియు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా నేడు సునీత మహేందర్ రెడ్డి నియోజక వర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రచారం నిర్వహించారు. కాప్రా లోని ఏ ఎస్ రావు డివిజన్ లో ఉన్న అనుపురం కమ్యూనిటీ హాల్ లో CPI (M) మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొనడం జరిగింది.. కర్మన్ ఘాట్ లోని మాధవరం సెరినీటి అపార్ట్మెంట్స్ లో అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సమావేశం లో ఎనుముల కొండల్ రెడ్డి గారితో పాల్గొనడం జరిగింది..

Patnam Sunitha Mahender Reddy Campaigning In AS Rao Division

Patnam Sunitha Mahender Reddy Campaigning In AS Rao Division

రాబోయే ఎంపీ ఎన్నికల్లో విజయం దిశగా సాగుతున్న మా ప్రయాణానికి నిన్నటి సీఎం రేవంత్‌ రెడ్డి గారి ర్యాలీతో కొండంత బలాన్ని అందించారు. మన పార్టీ నాయకుల సమిష్టి కృషితో రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలను అమలు చేయడమే మా లక్ష్యం. బస్తీల బతుకులు మారేలా, కష్టజీవి సంతోషపడేలా ముందుకు సాగుతున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాకు ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.

Patnam Sunitha Mahender Reddy Campaigning In AS Rao Division

Patnam Sunitha Mahender Reddy Campaigning In AS Rao Division

ప్రజా న్యాయం, ధర్మ పోరాటం, ప్రజా పాలన లక్ష్యంగా పని చేస్తున్న నాకు మీ యొక్క సహాయం మరియు పూర్తి మద్దతు అవసరం. రాబోయే ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడి విజయాన్ని వరంగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన హామీలను గురించి వివరిస్తూ సునీత మహేందర్ రెడ్డి ప్రచారం సాగుతోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News