Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి సర్వే ఫలితాలన్నీ సునీత వైపే..!

Qubetvnews - May 11, 2024 / 10:33 AM IST

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి సర్వే ఫలితాలన్నీ సునీత వైపే..!

Patnam Sunitha Mahender Reddy  :

దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పై మరింత ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూల పవనాలు ఉండటంతో పాటు ముఖ్య నాయకుల ప్రచారం కారణంగా గెలుపు నల్లేరు మీద నడకే అంటూ సర్వే ల్లో వెళ్లడి అయ్యింది.

గత కొన్ని నెలలుగా వచ్చిన సర్వేల ఫలితాలు, అధ్యయనాలు ఇలా పేరు ఏదైనా చెప్పే ఫలితం మాత్రం మల్కాజ్‌ గిరి లో ఫలితం కాంగ్రెస్ వైపే. అక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అభ్యర్థిగా సునీత మహేందర్‌ రెడ్డి కి క్లీన్‌ చీట్‌ ఉండటంతో పాటు ఇతర పార్టీలతో పోల్చితే అక్కడ కాంగ్రెస్ కు బలం ఎక్కువగా ఉంది. బీజేపీ మరియు బీఆర్‌ఎస్ మాయ మాటలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి మల్కాజ్ గిరిలో లేదని విశ్లేషకులు తమ సర్వేల్లో తెలుసుకున్నారట. మొత్తానికి మినీ ఇండియాలో సునీత మహేందర్‌ రెడ్డి గెలుపు దాదాపుగా ఖాయం అయ్యింది. అయినా కూడా ఆమె విశ్రమించకుండా ప్రచారంలో దూసుకు పోతున్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సునీత ప్రచారం చేశారు.

Results Of Surveys In Favor Of Patnam Sunitha Mahender Reddy

Results Of Surveys In Favor Of Patnam Sunitha Mahender Reddy

ప్రచారంలో భాగంగా సునీత మాట్లాడుతూ… మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలి. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఓబిసి సెల్ చైర్మన్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యత సమ్మేళనం నిర్వహించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహిళలను చిన్న చూపు చూసే వారికి ఓటు తో సమాధానం చెప్పాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మహిళలకు సముచిత గౌరవం, న్యాయం అందిస్తుంది. కనుక తనను గెలిపించి పార్లమెంట్‌ కు పంపించాలని, దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పవనాలు వీస్తున్న నేపథ్యంలో మహిళ సాధికారత కోసం రాహుల్ గాంధీ గారు కృషి చేస్తారంటూ సునీత మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News