Patnam Sunitha Mahender Reddy : జీరో ట్రాఫిక్ లక్ష్యంగా సునీత మహేందర్ రెడ్డి సొంత మేనిఫెస్టో
Qubetvnews - May 10, 2024 / 10:18 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సొంత మ్యానిఫెస్టో ని ప్రకటించారు. నియోజకవర్గంలో మురుగు నీటి శుద్ధి ప్లాంటుని అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు కాలుష్య నియంత్రణకి గ్రీన్ ఇండస్ట్రీలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్ల మరమ్మతులు, విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తామన్నారు. జీరో ట్రాఫిక్ లక్ష్యంతో రోడ్ల నిర్మాణం మరియు అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా కూడా తన సొంత మేనిఫెస్టోలో సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ ని రిపీట్ చేయబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులు కావడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జోష్ కనపడుతుంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో పలు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, రాబోయే రోజుల్లో అన్ని హామీలను అమలు చేయడంతో పాటు తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా తీసుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశేష కృషి చేస్తున్నారంటూ సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. కానీ మల్కాజ్గిరి లో ఇప్పటికే కాంగ్రెస్ విజయం కన్ఫామ్ అయ్యిందంటూ ఆ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీ స్థానంను కాంగ్రెస్ మళ్ళీ దక్కించుకోబోతుందని పట్నం సునీత మహేందర్ రెడ్డి వర్గీయులు ధీమాతో ఉన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ నుంచి బేగంపేట వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. మల్కాజ్ గిరి అభివృద్ది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలంటూ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ర్యాలీలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజల క్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మంచి జరుగుతుందని అన్నారు. మాయ మాటలు చెప్పే ఇతర పార్టీల కు ఓటు వేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వారు అవుతారంటూ సునీత మహేందర్ రెడ్డి ఓటర్లకు విన్నవించారు.





