Chandrababu : ఓ వైపు బిజేపి తో పొత్తుపై చర్చలు.. మరో వైపు రేవంత్ తో బాబు రహస్య భేటీ..!?
Qubetvnews - March 8, 2024 / 03:31 PM IST
Chandrababu : ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పోరాడాలి. ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. అంతే గానీ.. అక్రమార్గంలో ఎలాగైనా గెలవాలని.. గెలిచేందుకు ఏది వీలైతే అది చేసేయాలన్నదే చంద్రబాబు వైఖరి అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో జగన్ ను ఓడించాలంటూ జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే ఈ బలం సరిపోదని ఇప్పుడు ఆయన అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరిపిన చంద్రబాబు, పవన్.. నిన్న మరోసారి ఢిల్లీకి వెళ్లారు.
అయితే ఇలా బీజేపీతో దోస్తీ కోరుకుంటూనే.. ఇటు బీజేపీకి బద్ద శత్రువు అయిన కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బేగంపేట ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ కలయికపై వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాడని.. అటు బీజేపీతో దోస్తీ కోరుకుంటూనే.. ఇటు కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ తో కలవడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తోంది వైసీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు అనుచరుడిగా రేవంత్ కు పేరున్న సంగతిని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది.
రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సాయాన్ని ఇన్ డైరెక్టుగా తీసుకున్నారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ కు మేలు చేయడం కోసం చంద్రబాబు టీడీపీని తెలంగాణలో పోటీ చేయించలేదనే టాక్ ఉంది. అంతే కాకుండా రేవంత్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు మీడియా మొత్తం ప్రచారం చేసిందనేది బీఆర్ ఎస్ ఆరోపణలు. ఇలా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు రేవంత్ ను కలిశాడని వైసీపీ ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు రేవంత్ సాయం చేయబోతున్నాడని చెబుతోంది వైసీపీ.
ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ బోర్డర్ లో డబ్బు ట్రాన్స్ఫర్ కోసం.. సీఎం రేవంత్ తో చంద్రబాబు మంతనాలు జరిపారంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఇద్దరూ సీక్రెట్ గా ఎందుకు కలుసుకుంటారనేది వైసీపీ ప్రధాన వాదన.
ఎలాంటి సీక్రెట్ టాస్క్ లేకపోతే ఇద్దరూ బహిరంగంగానే కలుసుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ కు చంద్రబాబు సాయం చేస్తే.. ఇప్పుడు చంద్రబాబుకు రేవంత్ ఆర్థికంగా సాయం చేయబోతున్నాడని వైసీపీ ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తోంది.





