KCR : బీఎస్పీతో పొత్తు వెనక కేసీఆర్ మార్క్ రాజకీయం..!

Qubetvnews - March 8, 2024 / 09:15 AM IST

KCR : బీఎస్పీతో పొత్తు వెనక కేసీఆర్ మార్క్ రాజకీయం..!

KCR : కేసీఆర్ రాజకీయాల్లో సిద్ధహస్తుడు. తనకు దూరం అవుతున్న వర్గాలను ఎలా దగ్గరకు చేర్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇలా తనకు దూరం అవుతున్న ప్రతి వర్గాన్ని దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చాలా కోణాల్లో ఆలోచిస్తున్నారు. అసలు ఏయే వర్గాలు బీఆర్ ఎస్ దూరంగా ఉన్నాయి.. ఎందుకు దూరం అయ్యాయి అనే విషయాలను తెలుసుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తిరిగి ఆయా వర్గాలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నారని అంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ బీఎస్పీతో పొత్తులు పెట్టుకోవడం వెనక చాలా పెద్ద కారణమే ఉంది. వాస్తవానికి తెలంగాణలో ఎస్సీల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. వారి ఓట్ల కోసం కేసీఆర్ గతంలో చాలానే చేశారు. ఏకంగా దళిత బంధు లాంటి స్కీమ్ ను కూడా తీసుకువచ్చారు. అయితే ఈ దళిత బంధు కొందరికి రావడం.. కొందరికి రాకపోవడంతో బీఆర్ ఎస్ మీద దళితులు తీవ్ర అసహనంతో రగిలిపోయారు. దాంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో గట్టి దెబ్బ పడింది.

తెలంగాణలో మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే.. అందుకే బీఆర్ ఎస్ కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. కేవలం అలంపూర్, స్టేషన్ ఘన్ పూర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇంత తక్కువ సీట్లు గెలవడం ఇది మామూలు దెబ్బ కాదనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ కు దూరం అవుతున్న ఎస్సీలను మళ్లీ దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే బీఎస్పీతో తక్షణ పొత్తులు అవసరం అని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్ కు ఓ ఎంపీ టికెట్ కూడా కేటాయించేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకొందరిని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇస్తారని కూడా తెలుస్తోంది. ఇది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు కలిసొస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

ఎంపీ ఎన్నికల్లో తిరిగి మెజార్టీ సీట్లు సాధించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంపీ సీట్లు ఎక్కువ సాధిస్తే కచ్చితంగా తమకు ప్రజల్లో పట్టు ఉందని మళ్లీ నిరూపించుకోవచ్చు. అప్పుడు పార్టీ గ్రాఫ్‌ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News