Pawan Kalyan : చంద్రబాబు సైలెంట్.. పవన్ దూకుడు.. మీడియాలో ఇదే రచ్చ..!
Qubetvnews - October 17, 2024 / 10:53 AM IST
Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎక్కువగా పవన్ పేరే వినిపిస్తోంది. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్ మాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డూ అంశం తర్వాత చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. కానీ పవన్ మాత్రం దూసుకుపోతున్నారు. ఇదే చాలా అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక ప్రభుత్వంలో సీఎం వాయిస్ కంటే వారే వాళ్ల వాయిస్ తక్కువగా వినిపించేలా చూసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఏది చెప్పాలన్నా.. ఎలాంటి వాయిస్ వినిపించాలన్నా సరే సీఎం మాత్రమే చెబుతుంటారు.
మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏది చెప్పాలన్నా.. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా సరే చంద్రబాబే చూసుకునేవారు. కానీ లడ్డూ మ్యాటర్ సుప్రీంకోర్టులో రివర్స్ అయ్యేసరికి.. పవన్ మాత్రమే దూకుడుగా ఉంటున్నారు. చంద్రబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఓ వైపు పవన్ మాత్రం మొన్నటి వరకు తాను సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ వాగ్ధానాలు చేసేశారు. ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోవైపు పల్లె పండుగ కార్యక్రమాన్ని కూడా ఆయనే ప్రారంభించేశారు.
వాస్తవానికి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా సరే సీఎం చేపట్టాలి. అంటే చంద్రబాబు ప్రారంభించాలి. కానీ అసలు చంద్రబాబు ఈ ప్రోగ్రామ్ కే రాలేదు. కేవలం పవన్ అన్నీ తానై వ్యవహరించారు. ఏపీలోని గ్రామాలను ఎలా మారుస్తామో.. ఎలాంటి పనులు చేపడుతామో అన్నీ వివరించేశారు. పైగా కొత్త విధానాలను కూడా ఆయనే ప్రకటించేస్తున్నారు. దీంతో మళ్లీ మీడియాలో పవన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. దాంతో ప్రజల్లోకి కూడా ప్రభుత్వం అంటే చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ గురించే చర్చ జరిగేలా చేస్తున్నారు.
ఇది ఒక రకంగా జనసేనకు భారీ అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ ఎంత గుర్తింపు పొందితే.. ప్రజల్లోకి ఎంత బలంగా వెళితే అంత లాభం జరుగుతుంది. అయితే ఎవరు ముందు ఉంటే.. వారిపైనే డిమాండ్ లు కూడా పెరుగుతాయనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలనే డిమాండ్ లు బాగా పెరుగుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ డిమాండ్ లు ప్రధానంగా పవన్ ను చుట్టుముడుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈ నడుమ ఆయనే ఎక్కువగా స్పందిస్తున్నారు కదా.
అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఇప్పుడు పవన్ ను ముందు ఉంచుతున్నారా లేదంటే యాదృచ్చికంగా జరుగుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చాలా వరకు పవన్ కల్యాణ్ ఆలోచనతోనే ముందుకెళ్తుంటారు. మరి చంద్రబాబుకు వ్యూహం లేదా అంటే.. అదీ కాదు. మరి చంద్రబాబు సైలెంట్ గా ఉండటం వెనక ఏదో మర్మం ఉందనే కామెంట్లు వస్తున్నాయి. మరి పవన్ దూకుడు జనసేనకు లాభం చేస్తుందా.. చంద్రబాబు సైలెంట్ టీడీపీకి నష్టం చేస్తుందా అనేది కొంత కాలం ఎదురు చూస్తే తెలిసిపోతుంది.




