పవన్ రూపంలో బీజేపీకి దొరికిన పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్..!

Qubetvnews - November 18, 2024 / 09:05 PM IST

పవన్ రూపంలో బీజేపీకి దొరికిన పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్..!

బీజేపీలో మోడీ తర్వాత అంత క్రౌడ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పుకోవాలి. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి సీనియర్ల ఉన్నా వారికి జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. ఇక యూత్ వింగ్ లో చూసుకుంటే ఒకరిద్దరు ఎంపీలు ఉన్నా.. వారికి వారి రాష్ట్రాల్లో తప్ప పక్క రాష్ట్రాల్లో జనాలను ప్రభావితం చేసే అంత సీన్ లేదు. ఎన్డీయేలో చూసుకున్నా.. అంత స్టార్ ఇమేజ్ ముఖం బీజేపీకి ఇన్ని రోజులు లేదు. కానీ ఇప్పుడు ఆ లోటు పవన్ కల్యాణ్‌ తో పూర్తి అయిందని అంటున్నారు. ఎందుకంటే పవన్ కు ఉన్న సెలబ్రిటీ ఇమేజ్ అంతా ఇంతా కాదు.

ఇన్ని రోజులు ఏపీలో ఆయన పవర్ చూపించాడు. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా పవన్ ఇమేజ్ ను బీజేపీ బలంగా వాడుకోవాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా మొదటిసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రప్పించింది. ఒక డిప్యూటీ సీఎంను ప్రచారానికి సాధారణంగా తీసుకెళ్లరు. కానీ పవన్ ను తీసుకెళ్తే.. సీఎంల కన్నా ఎక్కువ క్రేజ్ కనిపించింది. మహారాష్ట్రలో పవన్ సభలకు జనాలు కిక్కిరిసిపోయారు. ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చినా సరే అంత మంది రాలేదు. కానీ పవన్ సభలకు మాత్రం జనాలు లక్షల్లో వచ్చారు.

అక్కడ ఆయన క్రేజ్ చూసి అంతా షాక్ అయిపోయారు. బీజేపీ నేతలు కూడా పవన్ క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోయారంట. దీంతో ఈ విషయం కాస్తా ఢిల్లీ బీజేపీ పెద్దల దాకా వెళ్లింది. దాంతో పవన్ ఇమేజ్ కూడా మహారాష్ట్రలో బలంగా వాడుకోవాలని బీజేపీ ఫిక్స్ అయిందంట. అందుకే రెండు రోజుల పాటు పవన్ తో సభలను నిర్వహించారు. ఇక నుంచి సౌత్ ఇండియాలో ఎక్కడ అవసరం ఉన్నా సరే పవన్ ను వాడుకోవాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన మోడీ తర్వాత బీజేపీకి పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ పవన రూపంలో దొరికాడని అంటున్నారు.

ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో పొలిటికల్ స్టార్ గా ఉన్నారు పవన్. రానున్న రోజుల్లో ఆయన దేశ వ్యాప్తంగా పొలిటికల్ స్టార్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎన్డీయే కూటమిలో నేషనల్ లెవల్లో పవన్ బలమైన లీడర్ కావడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News