Allu Arjun : అల్లు అర్జున్ ను ఎలా నిందిస్తారు.. ఐకాన్ స్టార్ కు పవన్ కళ్యాణ్ సపోర్ట్..!
Qubetvnews - December 30, 2024 / 04:46 PM IST
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన మనోగతాన్ని బయట పెట్టేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే నిందించడం సరికాదని తేల్చి చెప్పారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ లాంటిది. అలాంటప్పుడు ఒక్క హీరోను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఆయన అభిప్రాయ పడ్డారు. సంద్య థియేటర్ బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమా యూనిట్ నుంచి గానీ.. లేదంటే ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు అదే రోజు వెళ్లి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇక థియేటర్ వద్దకు భారీగా జనం వచ్చినప్పుడు అల్లు అర్జున్ చేతులు ఊపడంలో తప్పు లేదని పవన్ తేల్చి చెప్పారు. అలా చేయకపోతేనే తప్పు అని పవన్ చెప్పుకొచ్చారు. కొంత కాలంగా పవన్ కు అల్లు అర్జున్ కు గొడవలు ఉన్నాయంటూ ప్రచారం నడుస్తున్న సందర్భంగా పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పుష్ప టీమ్ ను వదిలేసి ఒక్క బన్నీనే అందరూ బద్నాం చేస్తున్నట్టు ఉందని పవన్ నిక్కచ్చిగా చెప్పేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. బన్నీ అందరికంటే ముందే శ్రీ తేజ్ కు అండగా ఉన్నాడు. ఆపరేషన కోసం రూ.10లక్షలు ముందు ఇచ్చాడు. ఆ తర్వాత అవసరాలన్నీ దగ్గరుండి తన టీమ్ ద్వారా చూసుకుంటున్నాడు.
అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ బాధ్యతను పూర్తిగా తీసేసుకుంది. దాంతో బాధిత కుటుంబం కూడా బన్నీ మీద పెట్టిన కేసును వాపసు తీసుకోవడానికి రెడీ అని అరెస్ట్ అయిన రోజే చెప్పేసింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలనేది కరెక్ట్ కాదని తేలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ చేతులు ఊపడాన్ని కూడా తప్పుబట్టారు. కానీ అలా చేయడం అస్సలు తప్పు కాదని పవన్ కల్యాణ్ తన అనుభవంతో చెప్పేశారు. అంటే తన అల్లుడు అల్లు అర్జున్ కు ఈ విధంగా ఆయన మద్దతు ప్రకటించేశారన్నమాట. ఏదేమైనా అల్లు అర్జున్ ను ఒక్కడినే బద్నాం చేయడాన్ని కూడా ఇక్కడ పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హీరోను పట్టుకుని ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ కూడా సపోర్టుగా మాట్లాడటంతో అల్లు అర్జున్ కు మద్దతు పెరుగుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన మీద ఎంత దాడి జరుగుతున్నా సరే సంయమనంతో మౌనంగానే ఉంటున్నారు. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోతున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అది బన్నీకి వారికి ఉన్న తేడా అని గుర్తించాలి.




