Pawan Kalyan : మరోసారి వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్..
Qubetvnews - June 25, 2024 / 12:36 PM IST
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలో కన్నా కూడా రాజకీయ పరంగాఏ ఎక్కువ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అప్పట్లో ఆయన వేలికి కొన్ని ఉంగరాలను కూడా పెట్టుకున్నారు. ఇక ప్రచారం కోసం వాహనం కొన్న తర్వాత దానికి కలిసి వచ్చే విధంగా వారాహి అనే పేరు పెట్టారు. అప్పుడు వారాహి విజయ యాత్ర కోసం ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టారు. 2022లో వారాహి దీక్షను చేసి యాగాలు కూడా చేశారు. తన క్యాంప్ ఆఫీసులో వియ సంకల్ప దీక్షను కూడా చేశారు పవన్ కల్యాణ్.
ఇక అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ విజయం సాధించారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్. పవన్ కల్యాణ్ అనుకున్న కల నెరవేరింది. దాంతో ఇప్పుడు ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేసేందుకు పూనుకున్నారు. అంటే తనకు గతంలో కలిసి వచ్చిన దీక్షను మరోసారి చేయబోతున్నారన్న మాట. అప్పుడు విజయం కోసం చేస్తే అనుకున్నట్టుగానే విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు తాను డిప్యూటీ సీఎం అయ్యాక తన చరిష్మా మరింత పెరిగేందుకు.. పరిపాలన సజావుగా సాగేందుకు ఆయన ఇలా వారాహి అమ్మవారి దీక్ష చేయబోతున్నారు.
ఇక ఈ దీక్షను ఆయన 11 రోజుల పాటు చేయబోతున్నారు. ఇందులో ఆయన కేవలం పండ్లు, ద్రవ రసాలు మాత్రమే తీసుకుంటారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో దీన్ని చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో జనసేన నేతలు ఈ 11 రోజులు పవన్ దీక్షను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక రోజు దీక్షలో భాగం అవుతారని అంటున్నారు. ఈ దీక్ష వల్ల పార్టీకి మరింత మేలు జరుగుతుందని జనసేన భావిస్తోంది. అందుకే ఈ 11 రోజుల పాటు పవన్ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ దీక్ష గనక పూర్తి చేస్తే ఇక జనసేనకు రాజకీయంగా తిరుగు ఉండదని అంటున్నారు కొందరు జ్యోతిష్యులు. ఎందుకంటే పవన్ జాతకం ప్రకారం ఈ దీక్ష ఎంతో కీలకం అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయిన జనసేన.. ఈ ఐదేండ్లు కూడా వందశాతం స్ట్రైక్ రేట్ తో ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు.




