Pawan Kalyan : పవన్ కల్యాణ్‌.. మిగతా మంత్రులను మించి ఇమేజ్ సంపాదిస్తున్నాడా..?

Qubetvnews - June 29, 2024 / 08:03 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌.. మిగతా మంత్రులను మించి ఇమేజ్ సంపాదిస్తున్నాడా..?

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఇప్పుడు అనుకున్న పొజీషన్ లో ఉన్నాడు. గత పదేండ్లుగా ప్రభుత్వంలో ఉండాలని.. తాను ప్రజలకు మార్పు అంటే ఏంటో చూపిస్తానని చెబుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడుఅనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌ మాత్రం మిగతా మంత్రులతో పోలిస్తే తానేంటూ నిరూపించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు సినిమాల్లో వందల కోట్లు సంపాదించే అవకాశాలను వదులుకున్నానని చెప్పిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఆ తేడా ఏంటో చూపించాలని భావిస్తున్నాడు.

తాను కచ్చితంగా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే చెప్పుకుంటున్న పవన్ కల్యాణ.. ఇప్పుడు ఆ మాటను నిజం చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తనకు కేటాయించిన ఐదు శాఖలను అత్యంత కీలకంగా తీసుకున్నారు. తన శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు తెప్పించుకున్నారు. శాఖల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే శాఖా పరమైన ఆదేశాలు ఇస్తున్నారు. అప్పటికప్పుడే వాటికి పరిష్కారాలు చూపిస్తున్నారు.

గ్రామాల్లో తాగునీరు, సాగునీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు పవన్ కల్యాణ్‌. అంతే కాకుండా మిగతా మంత్రుల్లాగా సైలెంగా గా ఉండట్లేదు. ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ఆయా శాఖలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేస్తున్న పనులు అందరి మన్ననలు పొందుతున్నాయి. ఇంతకు ముందు కంటే పవన్ కల్యాణ్‌ ఇప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని అంతా భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ కేవలం తనకు కేటాయించిన శాఖల పనులనే కాకుండా.. ఇతర శాఖల పనులన కూడా పర్యవేక్షిస్తున్నారు.

తన వద్దకు సమస్య అంటూ ఎవరు వచ్చినా సరే.. దానికి పరిష్కారం చూపించే వరకు వదిలి పెట్టట్లేదు. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్‌ పేరు ఏపీ రాజకీయాల్లో బాగానే వినిపిస్తోంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటున్నారు పవన్ కల్యాణ్‌.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News