Pawan Kalyan : పవన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా.. ఇంత పెద్ద వ్యూహం ఉందా..?
Qubetvnews - October 5, 2024 / 12:18 PM IST
Pawan Kalyan : పవన్ కల్యాణ్ 2029 వరకు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. మొన్న పవన్ కల్యాణ్ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. దీన్ని చేయించింది జనసేన పార్టీ. పక్కా ప్లాన్ ప్రకారమే.. జనసేన పెద్దలు ఇచ్చిన ప్రశ్నలను బేస్ చేసుకునే ఈ ఇంటర్వ్యూను చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న వేసింది సదరు యాంకర్. మీ కొడుకు 2029 వరకు సెంటర్ లో ఉండాలని మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అసలు పవన్ అభిమానులు ఎవ్వరూ ఊహించనిది.
ఎందుకంటే పవన్ ఇప్పుడున్న పొజీషన్ ను బట్టి చూస్తుంటే.. ఆయన రాబోయే ఎన్నికల్లో సీఎం కావాలని సగటు పవన్ అభిమాని ఎవరైనా కోరుకుంటారు. అంతే తప్ప కేంద్రంలోకి వెళ్లి ఏదో ఒక పదవి చేపట్టాలని అయితే కోరుకోరు. కానీ అంజనమ్మను ఈ ప్రశ్నను ప్లాన్ ప్రకారమే అడిగారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ సీఎం కావాలని చూస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో సీనియర్లు ఎవరూ పోటీలో లేరు. ఇప్పటికే సీనియర్ల వారసులు రాజకీయాల్లోకి వచ్చేశారు.
వారంతా కూడా లోకేష్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. అలా చూస్తే రాబోయే ఎన్నికల్లో లోకేష్ సీఎం అయితే.. పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఓకే గానీ.. లోకేష్ సీఎంగా ఉండి.. పవన్ తక్కువ పొజీషన్ లో ఉంటే జనసేన అభిమానులు తట్టుకోలేరు. అందుకే లోకేష్ కోసం పవన్ ను సైడ్ చేసే పనిలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూ అని అంటున్నారు. ఇప్పుడు పవన్ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనే పని మొదలు పెట్టారు.
మొన్న వారాహి సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకోసం తన పదవి, ప్రాణం వదులుకోవడానికి సిద్ధం అంటూ పవన్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే.. లోకేష్ కోసం పక్కకు తప్పుకుంటున్నా అంటే దానికి విలువ ఉండదు. అదే సనాతన ధర్మం కోసం పదవి వదులుకుంటున్నా అంటే ఎంత విలువ ఉంటుందో చూడండి. అందుకే పవన్ ఈ రకంగా సీఎం పదవిని వదులకుని.. సెంట్రల్ లో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఏదో ఒక పదవిని తీసుకుంటారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నాటికి వైసీపీని సమూలంగా లేకుండా చేయాలన్నది వారి ప్లాన్. ఇందుకోసం ఇప్పటి నుంచే జగన్ ను ఎన్ని రకాలుగా బ్లేమ్ చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. లడ్డూ కల్తీ అనేది ఇందులో మొదటి స్టెప్ అని తెలుస్తోంది. ఇలా జగన్ కు అధికారం రాకుండా చేసి.. ఇటు పవన్ ను త్యాగం అనే పేరుతో సైడ్ చేసి.. చివరకు లోకేష్ ను సీఎం చేస్తారని అంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పవన్ కూడా ఇక్కడే ఉండాలని జనసైనికులు పట్టుపడితే.. అప్పుడు చంద్రబాబు సీఎం అని డిక్లేర్ చేస్తారు. గెలిచిన తర్వాత చూసుకుందాం అంటారు. చివరకు లోకేష్ నే ఏదో ఒకటి చేసేసి సీఎం చేస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




