TDP : పొత్తుల వల్ల టీడీపీకి కలిసొచ్చేది ఆ ఒక్కటే.. ఇది మరీ దారుణం..!

Qubetvnews - February 17, 2024 / 07:34 AM IST

TDP : పొత్తుల వల్ల టీడీపీకి కలిసొచ్చేది ఆ ఒక్కటే.. ఇది మరీ దారుణం..!

TDP :

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ టీడీపీలో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ.. అటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే చాలా వరకు సీట్లను టీడీపీ వదులుకోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే జనసేన అన్నే తీసుకునే పరిస్థితి ఉందనుకున్నారు టీడీపీ నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ కూవ వచ్చి చేరింది. సరే జనసేన ఎలాగూ చంద్రబాబు ఎన్ని ఇస్తే అన్నే తీసుకుని సరిపెట్టుకుంటుందనుకోండి.

మరి బీజేపీ సంగతి ఏంటనేది ఇంకా తేలలేదు. ఎంత లేదన్నా జనసేన, బీజేపీ పార్టీల కోసం చంద్రబాబు కనీసం 40 ఎమ్మెల్యే సీట్లు, 12 ఎంపీ సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు. మరి ఇన్ని సీట్లు ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి పట్టు లేని జనసేన, బీజేపీ పార్టీలు ఎన్ని సీట్లు గెలుస్తాయనేది పెద్ద సందేహమే. కానీ అసలు బీజేపీ, జనసేన కోసం టీడీపీలో ఇప్పుడు ఎంత మంది టికెట్లను వదులుకోవడానికి రెడీ అవుతారనేది ఇంకా తెలియలేదు. అది టీడీపీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు సమరం సాగుతోంది. ఒకవేళ జనసేనకు గనక తమ టికెట్లు ఇస్తే మాత్రం రచ్చ రచ్చే అంటున్నారు టీడీపీ నేతలు. ఇదే విషయం ఇప్పుడు టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ నష్టాలను కాసేపు పక్కన పెడితే.. పొత్తుల వల్ల టీడీపీకి ఓ విషయం కలిసి వస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదేంటంటే ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 175 నియోజకవర్గాల్లో సరైన ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు. దాంతో ఎక్కడ ఆ పార్టీ పరువు పోతుందో అని ఇన్ని రోజులు చంద్రబాబు కాస్త భయపడ్డారు.

గత 2019 ఎన్నికల సమయంలో కూడా అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. దాంతో అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన కొంత మందిని తీసుకుని వారికి టికెట్లు కేటాయించుకున్నారు చంద్రబాబు. కానీ ఈ సారి అలాంటి భయం లేకుండా.. తనకు పట్టులేని నియోజకవర్గాలను పొత్తు పార్టీలకు ఇవ్వబోతున్నారంట.

అంటే టీడీపీకి సరైన ఎమ్మెల్యే అభ్యర్థులు లేని నియోజకవర్గ సీట్లను జనసేన, బీజేపీకి కేటాయించబోతున్నారు చంద్రబాబు. అలా తనకు అన్ని నియోజకవర్గాల్లో పట్టు లేదనే వాదనను బయటకు రాకుండా మేనేజ్ చేయబోతున్నారన్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News