Yatra 2 Movie Review : యాత్ర-2 మూవీ రివ్యూ..!
Qubetvnews - February 17, 2024 / 08:45 AM IST
Yatra 2 Movie Review :
సినిమాల ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కోణంలో మరో బయోపిక్ వచ్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా వచ్చింది. అది అప్పట్లో మంచి హిట్ అయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర-2ను తెరకెక్కించారు. ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్ప యాత్ర ఆధారంగా తెరకెక్కించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ పడ్డ ఇబ్బందులు, రాజకీయ పార్టీని పెట్టి ఎలా కష్టపడ్డాడు, ఎలా సీఎం అయ్యాడు అనేవి ఇందులో చూపించారు. జగన్ పాత్రలో జీవా నటించారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. నేడు థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ…
ఈ సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో మొదలవుతుంది. ఆయన మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. ఆయనపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎలాంటి కుట్రలు చేశాయి, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అనేవి చాలా బాగా చూపించారు. వైఎస్సార్ మరణం తర్వాత గొప్ప నాయకుడిని కోల్పోయామని ప్రజలు భావిస్తున్న సమయంలో జీవా (జగన్ పాత్ర) వచ్చి జనాలకు ఏం చేశాడు… ఆయన పార్టీని ఎలా నిలబెట్టుకున్నాడు, ఇతర రాజకీయ పార్టీలు తనను అణచివేయాలని చూస్తే ఎలా అడ్డుకున్నాడు, ఎలా విజయం సాధించాడు అనే పాయింట్లను బేస్ చేసుకుని సినిమా సాగుతుంది. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి కథను చూడాలంటే తెరమీద చూడాల్సిందే.
విశ్లేషణ…
మహి వి రాఘవ్ బయోపిక్ లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన యాత్ర సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు యాత్ర-2ను కూడా అదే కోణంలో తెరకెక్కించాడు. ఎక్కడా సినిమాటిక్ గా అనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇందులో ఆయన ఎక్కువగా రాజకీయ కోణం ఎంచుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఏ పార్టీని వ్యతిరేకించలేదు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, పార్టీని ఎలా నడిపించాడు, చివరకు ఎలా సీఎం అయ్యాడు అనేవి మాత్రం కండ్లకు కట్టినట్టు చూపించాడు. చాలా వరకు ఈ సినిమాను ఎమోషనల్ గా నడిపించాడు. చాలా చోట్ల ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా ఉంది సినిమా. ప్రతి ప్రేక్షకుడు ఒక ఎమోషనల్ ఫీల్ లోకి వెళ్తాడు. కాగా ఈ సినిమాలో చాలా వరకు జగన్ మీదనే ఫోకస్ పెట్టాడు. మిగతా పాత్రల పరిధిని తగ్గించి జీవా పాత్రనే హైలెట్ చేయడం బాగానే ఉంది.
అయితే బయట పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచించాయి, ఎలాంటి పనులు చేశాయనేది మాత్రం చూపించలేదు. అది కొంత ప్రేక్షకుడికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇది ప్రస్తుత రాజకీయాలకు అన్వయించి తీసిన సినిమా కాబట్టి వివాదం వైపు వెళ్లకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవాలి. ఇక అన్ని పాత్రలకు సరైన విధంగానే స్క్రీన్ ప్రజెంటేషన్ ఇచ్చాడు మహి వి రాఘవ్.

Yatra 2 Movie Review
నటీనటుల పనితీరు…
ఒక రాజీకయ నాయకుల పాత్రలను పోషించడం అంటే చాలా సవాల్ తో కూడుకున్న పని. కానీ వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. వారు పలికించిన హావభావాలు, కొన్ని సీన్లలో హుందాతనం అన్నీ ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఒక రకంగా జీవాకు ఇది గుర్తుండిపోయే సినిమా. ఇంకా చెప్పాలంటే ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీగా ఇదినిలిచిపోతుంది. ఈ సినిమాతో ఆయన చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడనే అంటున్నారు. ఆయన నటనలో పరిణితి కూడా కనిపించింది. ఇక జీవాతోపాటు నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే నటించారు. వారి పాత్రలకు న్యాయం చేశారు. మహేష్ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు.
టెక్నికల్ అంశాలు…
ఇది ఓవరాల్ గా డైరెక్టర్ సినిమా అని చెప్పుకోవాలి. ఇందులో ప్రతి సీన్ ను ఆయన తన కోణంలో తెరకెక్కించారు. ఎక్కడా సినిమాటిక్ గా అనిపించకుండా.. నేచురల్ గా ఉండేలా చూసుకున్నారు. ప్రతి పాత్రకు తగిన డైలాగులను ఎంచుకుంటూ ముందుకు నడిపించారు. చాలా చోట్ల కొన్ని సీన్లు కన్నీళ్లు పెట్టించేలా చూపించారు. జగన్ పాదయాత్ర ను చూపించిన విధానం కూడా బాగుంది. మొత్తానికి ఇది ఆయనలోని ప్రతిభను తెరమీద చూపించింది. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ అదరగొట్టేశాడు. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల కన్నీళ్లు పెట్టించింది. సాంగ్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఒక రకంగా రిచ్ లుక్ వచ్చేసింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. సినిమాలో డెప్త్ ను మిస్ చేయకుండా ఎడిటింగ్ చేశారు.

Yatra 2 Movie Review
ప్లస్ పాయింట్స్..
జీవా యాక్టింగ్
డైరెక్షన్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్..
కొంత కల్పిత కథ




