Kcr : కేసీఆర్ కు మరో చిక్కు.. వారు ఉంటారా.. వెళ్లిపోతారా..?

Qubetvnews - July 17, 2024 / 12:42 PM IST

Kcr : కేసీఆర్ కు మరో చిక్కు.. వారు ఉంటారా.. వెళ్లిపోతారా..?

Kcr : మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు అన్నీ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దాంతో ఆయన ఏం చేసినా అది బెడిసికొడుతోంది. ఓ వైపు కేసీఆర్ ఫ్యామిలీని కేసులు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎంతో కొంత గౌరవంగా ఉండేదేమో. కానీ బీఆర్ ఎస్ కు మాత్రం దారుణంగా ఒక్క సీటుకూడా రాలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేసింది.

దాంతో వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అటు కాంగ్రెస్ లోకి ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బీఆర్ ఎస్ ఎల్పీని మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలా జరిగితేనే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన భావిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కేసీఆర్ స్వయంగా అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని.. ఎలాంటి ఇబ్బందులు పడొద్దని చెబుతున్నారు.

ఇప్పుడు పార్టీకి అండగా ఉంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పొజీషన్ కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు మాత్రం ఉండట్లేదు. ఇలా వీరంతా కలిసి వెళ్లిపోతుంటే.. ఇంకోవైపు రాజ్యసభ సభ్యులపై బీజేపీ కన్నేసినట్టు తెలుస్తోంది. లోక్ సభలో బీఆర్ ఎస్ కు ప్రాతినిధ్యం లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు సభ్యులను బీజేపీ లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆల్రెడీ వారితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పార్థ‌సార‌థి రెడ్డి(2028), డి. దామోద‌ర్‌ రావు(2028), కేఆర్ సురేష్ రెడ్డి(2026), వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌(2030) ఉన్నారు.

ఇప్ప‌టికే ఉన్న కేకే.. పార్టీ మారిపోయారు. రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేశారు. ఉన్న ఈ నలుగురిని కూడా బీజేపీ తీసుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ ఎస్ కు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మరి ఆ నలుగురు ఉంటారా లేదంటే వెళ్లిపోతారా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News