Brs : ఆ విషయంలో దేశంలోనే బీఆర్ ఎస్ నెంబర్ వన్.. ఐదో స్థానంలో వైసీపీ..

Qubetvnews - July 21, 2024 / 02:16 PM IST

Brs : ఆ విషయంలో దేశంలోనే బీఆర్ ఎస్ నెంబర్ వన్.. ఐదో స్థానంలో వైసీపీ..

BRS : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ గత పదేండ్లు అధికారంలో ఉండి.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంతే కాకుండా ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దాదాపు 12 మంది ఇప్పటికే పార్టీ కండువాలు మార్చేశారు. ఇంకో 16 మందిని కూడా చేర్చేసుకుని బీఆర్ ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు.

అయితే ఇలా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ ఎస్ ఉంటే.. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఓ హైలెట్ న్యూస్ వచ్చింది. దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన తాజా రిపోర్టు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంటే దేశంలో ఏ పార్టీకి ఎంత ఆదాయం ఉందనే విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. ఇందులో భాగంగా… దేశంలోని ప్రాంతీయపార్టీలు అన్నింటికంటే ఎక్కువ ఆదాయం కలిగిన పార్టీ బీఆరెస్స్ అని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ క్రమంలో… 2022 – 23 ఫైనాన్షియల్ ఇయర్ లో బీఆరెస్స్ కు ఏకంగా రూ. 736.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు నివేదించింది.

ఇక బీఆర్ ఎస్ తర్వాత రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్టీకి ఏకంగా రూ.333.45 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో రూ.214.35 కోట్లతో డీఎంకే నిలిచింది. నాలుగో స్థానంలో బీజేపీ రూ.181 కోట్లతో ఉంది. ఐదో స్థానంలో రూ.74.78 కోట్లతో వైఎస్సార్సీపీ నిలిచింది. ఇలా దాదాపు దేశంలో ఉన్న 39 ప్రాంతీయ పార్టీలకు రూ.1740.48 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో కేవలం మొదటి ఐదు పార్టీలకు కలిపి ఏకంగా రూ.1541.32 కోట్ల ఆదాయం ఉంది. అంటే దాదాపు 80 శాతం ఈ ఐదు పార్టీలకే ఉంది.

మరి బీఆర్ ఎస్ ఇంత పెద్ద ఆస్తులను కలిగి ఉన్నప్పుడు ఆ పార్టీలో నుంచి ఎవరు వెళ్లినా.. మళ్లీ పార్టీ నిర్మాణం కోసం కావాల్సిన నిధులు ఆ పార్టీ వద్ద ఉన్నాయన్నమాట. కాబట్టి ఆర్థిక వనరుల విషయంలో బీఆర్ ఎస్ పార్టీకి ఇంకో ఐదేండ్ల దాకా ఎలాంటి ఢోకా లేదు. ఈ ఐదేండ్లు అభ్యర్థుల జేబుల్లో నుంచి తీయకపోయినా.. పార్టీ ఫండ్ సరిపోతుందని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News