Bjp : బీజేపీలోకి హరీశ్ రావు వెళ్తున్నారా.. ఈటల కామెంట్లకు అర్థమేంటి..?
Qubetvnews - July 14, 2024 / 11:51 AM IST
Bjp : బీఆర్ ఎస్ పరిస్థితి ఇప్పుడు రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే పెద్ద మైనస్ అయింది. ఇక ఎంపీ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో బీఆర్ ఎస్ ను వీడుతున్న వారే ఎక్కువ అవుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ ఎస్ ను ఖాళీ చేసేదాకా వదిలేలా కనిపించట్లేదు. ఒక వైపు కవిత జైల్లో ఉన్నారు. ఆమె బయటకు వచ్చే మార్గమే కనిపించట్లేదు. ఇంకోవైపు కేసీఆర్ మీద వరుసగా కమిషన్ల పేరుతో రేవంత్ నానా రచ్చ చేస్తున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులు పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే వేవ్ నడుస్తోంది. దాంతో హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. హరీశ్ రావు లాంటి బలమైన నాయకుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలో వీటి నుంచి గట్టెక్కాలంటే బీజేపీతో దోస్తీ కడితేనే ఆ పార్టీకి ప్లస్ అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే హరీవ్ రావు ఢిల్లీకి వెళ్లాడని.. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ బీజేపీతో బీఆర్ ఎస్ దోస్తీ కుదరకపోతే.. హరీశ్ తన దారి తాను చూసుకుంటాడని అంటున్నారు.
అంటే హరీవ్ రావు బీజేపీలోకి వెళ్లిపోతాడని అంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఈటల రాజేందర్ బలపరిచారు. బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని.. దానికి ఎవరమూ ఏమీ చేయలేమని తెలిపారు ఈటల రాజేందర్. తెలంగాణ బీజపీ పగ్గాలు ఈటల రాజేందర్ కు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల ఇలాంటి కామెంట్లు చేశారు అంటే కచ్చితంగా ఆయనకు సమాచారం ఉందేమో అంటున్నారు. ఏ సమాచారం లేకపోతే ఆయన వ్యాఖ్యలు చేయరు కదా అంటున్నారు.
నిజంగా హరీశ్ రావు బీఆర్ ఎస్ ను వీడి వెళ్తారా అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మీద బీఆర్ ఎస్ తరఫున బలంగా కొట్లాడుతున్నారు. పైగా హరీశ్ రావుకు పూర్తి స్వేచ్ఛను కేసీఆర్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమయంలో హరీశ్ రావు పార్టీ మారుతారని అనుకోలేం. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చూడాలి మరి ఆయన ఏం చేస్తారో..





