IRS officer turns transgender : దేశ చరిత్రలో మొదటి సారి.. ఐఆర్‌ఎస్‌ అధికారి ఆమె నుంచి అతడు!

Qubetvnews - July 10, 2024 / 08:39 PM IST

IRS officer turns transgender : దేశ చరిత్రలో మొదటి సారి.. ఐఆర్‌ఎస్‌ అధికారి ఆమె నుంచి అతడు!

IRS officer turns transgender : ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఉన్న ట్రాన్స్ జెండర్‌ సంస్కృతి ఇప్పుడు ఇండియాలో కూడా మొదలయ్యింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన పదేళ్ల కాలంలో వేలాది మంది ట్రాన్స్‌జెండర్స్ గా మారడం జరిగింది. తమది కాని జీవితంలో బతకడం ఎందుకు అనుకున్న వారు తమ జెండర్‌ ను మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. మొదట్లో వారిని సమాజంలో చిన్నచూపు చూసినా ఇప్పుడు వారికి కూడా గౌరవం లభిస్తుంది. ఏదో సమస్య అన్నట్లుగా కాకుండా, వారి మనసు అర్థం చేసుకోవాలి అన్నట్లుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వారిని ప్రోత్సహించడంతో ట్రాన్స్ జెండర్‌ ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఒక సర్వేలో వెల్లడి అయ్యింది.

ఇన్నాళ్లు సామాన్యులు మాత్రమే ట్రాన్స్‌ జెండర్స్ గా మారారు. అయితే దేశ చరిత్రలోనే మొదటి సారి ఒక ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌ ట్రాన్స్‌జెండర్‌ గా మారారు. ఇన్నాళ్లు మహిళగా ఉన్న ఐఆర్‌ఎస్ అధికారిని అనసూయ హైదరాబాద్‌ లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్‌ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ చీఫ్‌ కమీషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తన పేరును ఎం అనుకతిర్ సూర్య గా మార్చాలంటూ కేంద్ర హోం శాఖ కు విజ్ఞప్తి చేసింది. కేవలం పేరు మార్పిడి మాత్రమే కాకుండా రికార్డుల్లో స్త్రీ గా ఉన్న తనను పురుషుడిగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

వ్యక్తిగత స్వేచ్చ మరియు చట్ట ప్రకారం కేంద్ర హోం శాఖ ఇటీవల అనసూయ పేరును మార్చేందుకు మరియు ఆమె లింగం ను కూడా రికార్డుల్లో మార్చేందుకు అంగీకరించడంతో పాటు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇకపై ప్రతి చోట కూడా పురుషుడిగానే పరిగణించాలంటూ అన్ని శాఖల వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

చెన్నై కి చెందిన అనుకతిర్‌ మ్రదాస్ ఐఐటీ లో గ్రాడ్యేషన్ పూర్తి చేయడం తో పాటు సివిల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు తన పేరును మరియు లింగంను మార్చుకోవడం ద్వారా మొత్తం దృష్టిని తనవైపు ఆకర్షించడం జరిగింది. ఇప్పటికే తన కట్టు బొట్టు మార్చేసిన అనుకతిర్ తన వర్కింగ్‌ స్టైల్‌ ను కూడా మార్చేస్తారేమో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News